
కొనసాగిన ఆటోల తనిఖీ
రాయచూరు రూరల్: నగరంలో నాలుగో రోజు 200 ఆటోలను తనిఖీ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఈరేష్ నాయక్ వెల్లడించారు. శుక్రవారం పోలీస్ స్టేన్‌లో ఆటో డ్రైవర్లకు లైసెన్సులు, పర్మిట్లు, ఆర్‌సీ, ఇతర బ్యాడ్జీలు, ఆటోలకు ఎలాంటి పర్మిషన్లు లేని వాటిని చెక్ చేసి సీజ్ చేశామన్నారు. ఆర్‌టీఓ కార్యాలయంలో వీటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఆటోలను యజమానులకు అప్పగిస్తామన్నారు. నగరంలో 80 శాతం ఆటోలకు ఇన్సూరెన్సులు, ఇతరత్ర పత్రాలు లేవన్నారు. వారి నుంచి జరిమానా రూపంలో రూ.70 వేలు వసూలు చేశామన్నారు. ఆగస్టు ఒకటో తేదీలోగా ఆటోడ్రైవర్లు, యజమానులు తమ రికార్డులను సరి చేసుకోవాలన్నారు.
ఎస్పీని బదిలీ చేయొద్దు
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లా ఎస్పీ ప్రథ్వీశంకర్‌ను బదిలీ చేయవద్దని మాజీ మంత్రి రాజుగౌడ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణ, మట్కా, జూదం, ఇతరత్ర అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారని, అలాంటి నిజాయితీ అధికారిని బదిలీ చేయకుండా యాదగిరి జిల్లాలోనే కొనసాగించాలని, ప్రామాణికతతో విధులు నిర్వహించే అధికారులను బదిలీ చేయవద్దని కోరినట్లు తెలిపారు.
వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన
రాయచూరు రూరల్: నగరంలో వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం సోదరులు నిరసన తెలిపారు. శుక్రవారం హాజీ కాలనీలో మైనార్టీ సోదరులు నమాజ్ అనంతరం మూకుమ్మడిగా ప్రార్థనలు చేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి తీసుకున్న వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ రెండు గంటల పాటు నిరసన ప్రదర్శనను జరిపారు.
అసంఘటిత కార్మికులకు స్మార్ట్‌కార్డ్‌లు
హొసపేటె: రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చెందిన 35 లక్షల మంది కార్మికులను గుర్తించి, ఉచితంగా నమోదు చేయించి వారికి స్మార్ట్ కార్డ్‌లను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోందని కార్మిక శాఖ మంత్రి, సంఘటిత కార్మికుల సామాజిక భద్రతా మండలి అధ్యక్షుడు సంతోష్‌లాడ్ అన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని మల్లిగె హోటల్‌లో ఏర్పాటు చేసిన అసంఘటిత కార్మికులకు స్మార్ట్ కార్డ్‌ల పంపిణీ, వివిధ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచ గ్యారంటీల అమలుపై విపక్షాలు చేసిన అన్ని ఆరోపణలకు కేవలం రెండు నెలలకే గ్యారెంటీ పథకాలను అమలు చేసి తగిన జవాబు చెప్పామన్నారు. రాష్ట్ర ప్రజలకు సంవత్సరానికి నేరుగా రూ.60 వేల కోట్లు, ఐదేళ్లకు రూ.3 లక్షల కోట్లను ఇచ్చే దేశంలోని ఏకై క సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. ఎంపీ ఈ.తుకారాం, ఎమ్మెల్యేలు గవియప్ప, లతా మల్లికార్జున, జిల్లాధికారి దివాకర్, హుడా అధ్యక్షుడు ఇమామ్, నగరసభ అధ్యక్షులు రూపేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేఎంసీ ఆస్పత్రి డైరెక్టర్‌గా డాక్టర్ ఈశ్వర్ హొసమని
హుబ్లీ: కర్ణాటక మెడికల్ కళాశాల(కేఎంసీ) పరిశోధన సంస్థ ఆస్పత్రి ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర్ హొసమని పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఉన్న డైరెక్టర్ డాక్టర్ ఎస్‌ఎఫ్ కమ్మరా శుక్రవారం డాక్టర్ ఈశ్వర్‌కు బాధ్యతలను అప్పగించారు. ఆ మేరకు ప్రభుత్వం ఆకస్మికంగా ఆదేశాలను వెల్లడించింది. శస్త్ర చికిత్స విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఈశ్వర్ హొసమని సదరు ఆస్పత్రి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా కూడా వ్యవహరిస్తారు. ఈ కళాశాలలోనే ఎంబీబీఎస్, ఎంఎస్ చదివిన ఆయన 2006 నుంచి ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

కొనసాగిన ఆటోల తనిఖీ

కొనసాగిన ఆటోల తనిఖీ

కొనసాగిన ఆటోల తనిఖీ