
ఆ భర్తపై పోక్సో కేసు నమోదుకు రంగం సిద్ధం
రాయచూరు రూరల్: వంతెన మీద నుంచి భర్తను భార్య నదిలోకి తోసిన కేసు కొత్త మలుపు తిరిగింది. రాయచూరు తాలూకా గుర్జాపూర్ వంతెన వద్ద కట్టుకున్న భార్యే తనను కృష్ణా నదిలోకి తోసిందని శక్తినగర్‌కు చెందిన తాతప్ప ఆరోపించాడు. మూడు నెలల క్రితం యాదగిరి జిల్లా వడగేరకు చెందిన గెద్దెమ్మకు తాతప్పతో వివాహమైంది. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చెలరేగడంతో విడాకుల కోసం కోర్టు మెట్లెడానికి సిద్దమైన తాతప్ప మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి వీరనగౌడ, మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారికి లేఖ రాశారు. గెద్దమ్మ వయస్సులో చిన్నదని, ఆమెను వివాహం చేసుకున్న తాతప్పపై బాల్య వివాహ నిరోధక పోక్సో చట్టం కింద కేసు నమోదుకు అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు.
కళాశాల భవనం నిర్మించాలని ధర్నా
రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా హట్టి బంగారు గనుల కంపెనీలో ఉన్న పాత జూనియర్ కళాశాల భవనం అధ్వాన్న స్థితికి చేరుకుందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) పేర్కొంది. సోమవారం హట్టి బంగారు గనుల కంపెనీ సమీపంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద విద్యార్థులు తరగతి గదులను బహిష్కరించి కళాశాల వద్ద నుంచి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ సంచాలకుడు రమేష్ మాట్లాడారు. పాత కళాశాలను తొలగించి నూతన కళాశాలను నిర్మించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
పక్కాగా కులగణన
నమోదు చేయాలి
హొసపేటె: జనాభా లెక్కల గణనలో ప్రతి ఒక్కరూ తమ కులగణనను సరిగ్గా నమోదు చేయాలని మాజీ మంత్రి పీటీ పరమేశ్వర నాయక్ తెలిపారు. విజయనగర జిల్లా బంజారా సాహిత్య పరిషత్ కొత్త జిల్లా యూనిట్ ప్రారంభోత్సవం నగరంలోని అంబేడ్కర్ భవన్‌లో జరిగిన ఆఫీస్ బేరర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో బంజారా సమాజం భారీ సంఖ్యలో ఉందని అన్నారు. తాండా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సొసైటీ లెక్కల ప్రకారం జనాభా 40 లక్షల వరకు ఉందన్నారు. అంతర్గత రిజర్వేషన్లలో మనం ఎక్కువ వాటా పొందాలనుకుంటే రాష్ట్రంలోని మొత్తం 3900 తాండాలలో కులగణనను సరిగ్గా నమోదు చేయాలన్నారు. నగరాల్లో ఉన్నవారు కూడా ఎటువంటి సంకోచం లేకుండా తమ కులాన్ని నమోదు చేయాలన్నారు. వెనుకబడిన తరగతుల కమిషన్ ద్వారా కూడా పునః సర్వే నిర్వహిస్తారన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా దీనికి ఆమోదం తెలిపారన్నారు. ఆ తర్వాత మేం తాండాలు, నగర, పట్టణ ప్రాంతాలను సందర్శించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. సమాజ రాజకీయ నాయకులు, బంజారా మఠాధిపతులు కూడా కుల గణన గురించి అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు. బంజారా గురుపీఠం శివప్రకాష్ మహారాజ్ స్వామీజీ, బంజారా నేతలు పాల్గొన్నారు.
కార్మికుల వేతన
బకాయిలు చెల్లించరూ
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పెండిగ్‌ంలో ఉన్న మహిళా కార్మికుల ఆరు నెలల వేతనాలు చెల్లించాలని సఫాయి కర్మచారుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం సాంఘీక సంక్షేమ శాఖ జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన జిల్లాధ్యక్షురాలు అజీజ్ మాట్లాడారు. రాయచూరు జిల్లా సింధనూరు ఆర్టీసీ బస్టాండ్‌లో స్వచ్ఛత పనులు చేపట్టే సఫాయి కర్మచారులకు ఆరు నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా ఉన్నారని ఆరోపించారు. వేతనాలు ఇవ్వమంటే పనుల నుంచి తొలగిస్తామని నూతన ఏజెన్సీలు బెదిరిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్టీసీ బస్టాండ్‌లో స్వచ్ఛత పనులు చేపట్టే సఫాయి కర్మచారులకు వేతనాలు అందేలా చూడాలని కోరుతూ సాంఘీక సంక్షేమ శాఖాధికారికి వినతిపత్రం సమర్పించారు.
భక్తులకు ముద్రాధారణ
రాయచూరు రూరల్: నగరంలో శ్రీపాదంగళ్ ముద్రాధారణ కార్యక్రమం చేపట్టారు. సోమవారం రాయచూరు జవహర్ నగర్‌లోని రాఘ వేంద్ర స్వాముల మఠంలో మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ భక్తులకు ముద్రాధారణ చేశారు.

ఆ భర్తపై పోక్సో కేసు నమోదుకు రంగం సిద్ధం

ఆ భర్తపై పోక్సో కేసు నమోదుకు రంగం సిద్ధం

ఆ భర్తపై పోక్సో కేసు నమోదుకు రంగం సిద్ధం