
జోరుగా టీబీ డ్యాం గేట్ల నిర్మాణ పనులు
హొసపేటె: తుంగభద్ర జలాశయంలోని 19వ గేటు వద్ద ఏర్పాటు చేసిన స్టాప్‌లాగ్ గేట్‌ను తొలగించి శాశ్వత క్రస్ట్‌గేట్ నిర్మించడానికి గుజరాత్‌కు చెంది హార్వర్డ్ టూల్స్ అండ్ మిషనరీ కంపెనీ టెండర్ దక్కించుకొన్న విషయం తెలిసిందే. గేట్లకు సంబంధించి 19వ గేట్ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగతా 32 క్రస్ట్‌గేట్లుకు సంబంధించిన నిర్మాణ పనులు టీబీ డ్యాం ఎస్టేట్ కార్యాలయం మైదానంలో చకచకా సాగుతున్నాయి. పక్కా పకడ్బందీగా గేట్ నిర్మాణంపై కంపెనీ దృష్టి పెట్టనుంది. ప్రస్తుతం ఇక్కడ రెండు గేట్లకు సంబంధించి నిర్మాణ పనులు ప్రారంభించారు. మరో 20 రోజుల్లోగా నాలుగు గేట్ల పనులు పూర్తి కానున్నాయని, నవంబర్ నెల లోపు మొత్తం గేట్ల నిర్మాణ పనులు పూర్తి కానుందని గుజరాత్ కంపెనీ ఇంజినీర్ తెలిపారు.
రూ.48 కోట్ల ఖర్చుతో మొత్తం 33 క్రస్ట్‌గేట్లు నిర్మాణం
గుజరాత్ కంపెనీకి శాశ్వత గేటు
నిర్మాణ పనుల టెండర్

జోరుగా టీబీ డ్యాం గేట్ల నిర్మాణ పనులు