
భక్తిశ్రద్ధలతో ఆడికృత్తిక పూజలు
బళ్లారిఅర్బన్: నగరంలోని ఫైర్ ఆఫీస్ ఎదురుగా గల కుమారస్వామి దేవస్థానంలో ఆడికృత్తిక పూజలతో పాటు సోమవారం రథోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. స్వామి వారికి పంచామృతాభిషేకం, వెండి ఆభరణాలు, పూలతో అలంకరణ, మహామంగళారతి భక్తులకు దర్శనం, అన్నదాన కార్యక్రమాన్ని నెరవేర్చి దేవస్థాన ఈఓ హనుమంతప్ప తెలిపారు. అలాగే కుమారస్వామి రథోత్సవాన్ని ఆ ప్రాంతంలో కన్నుల పండువగా నెరవేర్చి భజన, భక్తి గీతాలను ఆలపిస్తూ కుమారస్వామి దేవస్థానం నుంచి ఎస్పీ సర్కిల్ వరకు ఊరేగింపు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా కుమారస్వామి రథోత్సవం