
24న హృద్రోగ పరీక్ష శిబిరం
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 24న ఉచిత గుండెపోటు వ్యాధి పరీక్ష, చికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు స్పర్శ ఆస్పత్రి నిర్వాహకుడు రాజశేఖర్ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని రైల్వే స్టేషన్ రహదారిలోని స్పర్శ ఆస్పత్రి శాఖలో ఒక రోజు ఉచితంగా ఈసీజీ, గుండెపోటు చికిత్స శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అమరేగౌడ, రాచప్ప, బసవరాజ్ మలకప్ప గౌడలున్నారు.
డివైడర్‌కు బైక్ ఢీకొట్టి
యువకుడు మృతి
రాయచూరు రూరల్: నగరంలో భారీ వర్షం కురుస్తుండగా డివైడర్‌కు బైక్ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన ఆర్‌టీఓ సర్కిల్ వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతుడిని నగరానికి చెందిన రాకేష్ పట్టి(30) ఆస్పత్రిలో మరణించారు. మరో వ్యక్తికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సణ్ణ ఈరణ్ణ నాయక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కొప్పళ క్రెడిల్‌లో నిధుల దుర్వినియోగం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో మహర్షి వాల్మీకి నిగమ మండలిలో బహు కోటి రూపాయల నిధుల అవినీతి జరిగినట్లుగానే కర్ణాటక గ్రామీణ మౌలిక సౌకర్యాల అభివృద్ధి మండలి(క్రెడిల్)లో రూ.72 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయి. 2019 నుంచి 2025 వరకు కొప్పళ జిల్లాలో 96 పనుల విషయంలో అప్పటి ఈఈ చించోళికర్, కాంట్రాక్టర్ ఉద్యోగి కళకప్ప నిడగుంది కలసి రూ.72 కోట్ల నిధులు అవినీతికి పాల్పడినట్లు కొప్పళ డివిజన్ ఈఈ అనిల్ కుమార్ పాటిల్, సబ్ డివిజన్ అధికారి ఆనంద్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. కొప్పళలో 96 పనులను చేసినట్లు రికార్డులు తయారు చేసి నిధులు వాడుకున్నారు. క్రెడిల్ నుంచి మురుగు కాలువల నిర్మాణాలు, రహదారులు, తాగునీరు, ఇతర పనులు చేసినట్లు నకిలీ బిల్లులు రూపొందించి నిధులు కాజేసినట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై లోకాయుక్త అధికారులు విచారణకు శ్రీకారం చుట్టారు.
గుంజళ్లి ఆరోగ్య
కేంద్రం పరిశీలన
రాయచూరు రూరల్: జిల్లాలో బాలింతలు మృతి చెందిన ఘటనపై జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సురేంద్ర బాబు పరిశీలించారు. సోమవారం రాయచూరు తాలూకా గుంజళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ చేసి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇన్, ఔట్ పేషెంట్లకు ఔషధాల పంపిణీ విషయంపై చర్చించారు.
యాదగిరి ఆస్పత్రిలో
ఆకస్మిక తనిఖీ
రాయచూరు రూరల్ : యాదగిరి ఆస్పత్రిలో వైద్యులపై జిల్లాధికారి బీహెచ్.నారాయణరావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆస్పత్రిని సందర్శించి వైద్యాధికారుల హాజరు పట్టికను పరిశీలించారు. ప్రజల నుంచి ఆస్పత్రిపై ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీలు జరిపారు. రోగులకు సక్రమంగా వైద్య సేవలందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహించడాన్ని తప్పుబట్టారు. మహిళల, ప్రసూతి ఇతర విభాగాలను పరిశీలీంచి వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. పేద రోగులకు వైద్య సేవలు అందించేలా చూడాలని సూచించారు.

24న హృద్రోగ పరీక్ష శిబిరం

24న హృద్రోగ పరీక్ష శిబిరం

24న హృద్రోగ పరీక్ష శిబిరం