
పేదలకు నోటీసులు తగదు
రాయచూరు రూరల్: నగరంలో మావినకెరె చెరువు గట్టుపై నివాసం ఉంటున్న పేదలకు నోటీసులు అందజేయడం తగదని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. శుక్రవారం జిల్లాదికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జైభీమ్ మాట్లాడారు. మావినకెరె చెరువు గట్టును కబ్జా చేసిన పేదలకు వారం రోజుల్లో స్థలాలను ఖాళీ చేయాలని ఆదేశించడాన్ని తప్పుబట్టారు. 1999లో 14 మంది నగరసభలో ఆస్తి పన్ను కట్టిన విషయాన్ని ప్రస్తావించారు. గురువారం సాయంత్రం స్థలాలను ఖాళీ చేయాలని జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు.