
పంచ గ్యారెంటీలకే సమయం లేదు
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పంచ గ్యారెంటీల అమలుకే సమయం లేదు, ఇక అభివృద్ధి ఎక్కడ ఉందని, ముఖ్యమంత్రి పదవికి ఆ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయని రాష్ట్ర జనతాదళ్(ఎస్) యువ అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి ఆరోపించారు. శుక్రవారం బీదర్ జిల్లాలో ప్రజలతో జనతాదళ్ జాతా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఐదేళ్ల పదవికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య పగటి కలలు కంటున్నారన్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు మిన్నంటాయన్నారు. ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, వైఫల్యాలు బట్టబయలు అవుతున్నాయన్నారు. మధ్యవర్తుల ఆధారంగా కమీషన్ల దందాలతో ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఏడాదిలోగా రాష్ట్రంలో విప్లవం జరుగుతుందనడంలో ఆశ్చర్యం లేదన్నారు. రైతులు పండించిన వరి, జొన్న పంటలకు రక్షణ కల్పించలేదన్నారు. కేంద్రంలో అధికారం చేపట్టిన తరుణంలో కుమారస్వామి మామిడి, పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించారన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బండెప్ప కాశంపూర్, వెంకట్రావ్ నాడగౌడ, హన్మంతప్ప ఆల్కోడ, మాజీ శాసన సభ్యుడు రాజా వెంకటప్ప నాయక్, చంద్రశేఖర్, రశ్మి రామేగౌడలున్నారు.
ఐదేళ్ల ముఖ్యమంత్రి పదవికి దోబూచులాట
యువ జేడీఎస్ నేత నిఖిల్ కుమారస్వామి