
ఆగని హృదయాఘాతం
యశవంతపుర/ దొడ్డబళ్లాపురం: రాష్ట్రవ్యాప్తంగా గుండెపోటు విషాదాలు ఏమాత్రం తగ్గడం లేదు. హాసన్, మండ్య, బెంగళూరు ప్రాంతాల్లో శుక్రవారం ఐదుమంది కన్నుమూశారు. గత 45 రోజుల నుంచి హాసన జిల్లాలోనే గుండెపోటు మరణాల సంఖ్య 34కు పెరిగింది.
హాసన్‌లో యువకుడు...
● హాసన్‌కు సమీపంలోని చిక్కకొండ చిట్నిహళ్లి గ్రామంలో మదన్ (21) అనే యువకుడు గుండె పట్టుకుని చనిపోయాడు. తల్లితో కలిసి చన్నపట్టణలో నివాసం ఉంటున్నారు. రెండు రోజుల చిక్కకొండలోని బావ ఇంకికి వచ్చారు. గురువారం రాత్రి ఎదలో నొప్పి అంటూ కుప్పకూలిపోయాడు.
● హాసన్ జిల్లా ఆలూరు తాలూకా కల్లహళ్లి గ్రామానికి చెందిన రాజమ్మ జూన్ 14న ఇంటిలో వంట పని చేస్తుండగా కిందపడి చనిపోవడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
● హాసన్ నగరానికి చెందిన బీఎం విమల (55) అనే మహిళ కొప్పలో ఇంటిలో పని చేస్తుండగా గురువారం రాత్రి గుండెనొప్పి వచ్చింది. కుటుంబ తక్షణం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది.
● మండ్య జిల్లా మళవళ్లి తాలూకా బాళెహొన్నగ గ్రామంలో శిల్పా (45) ఇంట్లో పాత్రలను శుభ్రం చేస్తుండగా గుండెపోటుతో మరణించింది.
ధర్నాకు వస్తూ రైతు నేత...
దేవనహళ్లి తాలూకాలో భూస్వాధీనాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారంనాడు బెంగళూరులో జరుగుతున్న రైతుల పోరాటంలో పాల్గొనడానికి వస్తున్న రైతు గుండెపోటుతో మృతిచెందిన సంఘటన బెంగళూరులో క్రాంతివీర సంగొళ్లి రాయణ్ణ సర్కిల్‌లో జరిగింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా కురుబరహుండి గ్రామం నివాసి అయిన రైతు నేత ఈశ్వర్ (40), ధర్నాలో పాల్గొనడానికి ఫ్రీడంపార్క్ కు వస్తున్నాడు. రైలులో వచ్చిన ఈశ్వర్ ఫ్రీడం పార్క్‌కు వస్తూ సర్కిల్‌లో కుప్పకూలిపోయాడు. రైతులు అతన్ని శేషాద్రిపురం కార్పొరేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక చనిపోయాడు. రైతులు తీవ్ర విషాదానికి లోనయ్యారు.
రైతు నాయకుడు ఈశ్వర్ (ఫైల్)
రాష్ట్రంలో మరో ఐదుమంది తుదిశ్వాస
నిరసనకు వస్తూ రైతునేత హఠాన్మరణం
కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు: కమిటీ
రాష్ట్రంలో జరుగుతున్న గుండెపోటు మరణాలకు, కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సాంకేతిక సలహా మండలి నివేదిక ఇచ్చింది.
10 మంది నిపుణులు కలిగిన కమిటీ ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
కోవిడ్‌కు గురైన వారిలో స్వల్ప హృదయ సమస్యలు తలెత్తాయని, అయితే గుండెపోటుకు ఆ వ్యాక్సిన్ కారణం కాదని పేర్కొన్నారు. కోవిడ్ సోకిన వారిలో కొన్ని ఆరోగ్య సమస్యలు కనిపించినట్టు తెలిపారు.
15 ఏళ్ల వయసు నుంచి పాఠశాల విద్యార్థులకు స్క్రీనింగ్ చేయాలని, అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని సూచించారు.
పాఠ్య పుస్తకాల్లో కూడా గుండెపోటుకు గురించి పాఠ్యాంశం చేర్చాలని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని తప్పనిసరిగా నిషేధించాలని, గుండె సమస్యల రిజిస్టర్ ను ప్రారంభించాలని తెలిపారు.
గుండెపోటుతో చనిపోయినవారికి పోస్టుమార్టం నిర్వహించి గుర్తించిన అంశాలను నమోదు చేయాలని, జిల్లా ఆస్పత్రులలో రక్తాన్ని పలుచన చేసే ట్యాబ్లెట్‌లు నిల్వ చేయాలని నివేదికలో పేర్కొన్నారు.

ఆగని హృదయాఘాతం

ఆగని హృదయాఘాతం

ఆగని హృదయాఘాతం