
తొలి ఏకాదశి వైభవం
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం మొహర్రంను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. మత భేదభావాలను మరిచి పాల్గొన్నారు. పీర్ల దేవుళ్లను అలంకరించి ఊరేగింపులు నిర్వహించారు. వీధివీధినా భక్తులు చక్కెర చదివింపులు జరిపించారు. తెల్లవారుజామున అగ్ని గుండంలో పీర్ల స్వాములను ఎత్తుకుని నడిచారు. ఉత్తర కర్ణాటకతో పాటు చిక్కమగళూరులోనూ మొహర్రంను ఆచరించారు. కొన్నిచోట్ల ముస్లింలు రక్త తర్పణం నిర్వహించారు. –యశవంతపుర
మాలూరు: తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం తాలూకాలోని చిక్కతిరుపతి గ్రామంలో ఉన్న పురాణ ప్రసిద్ధ ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయానికి భక్తులు తరలివచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు దేవాలయానికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. పూలతో స్వామి వారిని సుందరంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచి పూజలను ప్రారంభించారు. మూల విగ్రహానికి పంచామృత అభిషేకం, వేద మంత్ర పారాయణం తదితరాలు గావించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులు స్వామి దర్శనం కోసం వరుసలు కట్టారు. ప్రధాన అర్చకులు ఎన్ శ్రీధర్ నేతృత్వంలో పూజలు నిర్వహించారు. పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు.
అగర ఆలయంలో..
బొమ్మనహళ్లి: పవిత్ర తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా బెంగళూరు బొమ్మనహళ్ళి అగరలో చరిత్ర ప్రసిద్ధ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. తెల్లవారుజామునే అభిషేకం, అలంకారాలు గావించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వేలాదిగా భక్తులు దర్శనం చేసుకున్నారు.

తొలి ఏకాదశి వైభవం

తొలి ఏకాదశి వైభవం