
ఊపందుకున్న రుతుపవనాలు
బనశంకరి: రాష్ట్రంలో, ప్రత్యేకించి కోస్తా, మల్నాడు ప్రాంతాల్లో రుతుపవన వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. నదులు, చెరువులు, నదు పొంగిపొర్లుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చిక్కమగళూరు, కొడగు, హాసన, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలో శనివారం బడులు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. కొడగు జిల్లాలో వానలతో హారంగి జలాశయం నిండిపోయింది, కావేరి నదిలోకి 5వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. చిక్కమగళూరు జిల్లా ఎన్‌ఆర్.పుర, శృంగేరి, హొరనాడు, కొప్ప, జయపుర తో పాటు వివిధ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక్కడ 5 రోజుల పాటు ఆరెంజ్ అలెర్ట్‌ను ప్రకటించారు. దక్షిణ కన్నడ, చిక్కమగళూరును కలిపే చార్మాడీ ఘాట్‌లో వానతో పాటు దట్టమైన పొగ మంచు ఆవరించింది. వాహనాల సంచారానికి ఆటంకం ఏర్పడింది. ఈ ఘాట్ రోడ్డులో కొండలపై నుంచి జలపాతాలు జాలువారుతుండటంతో ప్రయాణికులు అక్కడ గుమిగూడుతున్నారు. ప్రమాదాలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
బెంగళూరు పరిసరాల్లో
అలాగే బెంగళూరు, తుమకూరు, బెంగళూరు గ్రామాంతర, మండ్య, మైసూరు, కోలారు, చిత్రదుర్గ, శివమొగ్గ, చిక్కబళ్లాపుర, దొడ్డబళ్లాపుర తదితర జిల్లాల్లో మబ్బులతో కూడిన వాతావరణం ఏర్పడింది. బెంగళూరులో జల్లు వానలు పడ్డాయి. ఉత్తర కర్ణాటకలోనూ వర్షాలు పడుతున్నాయి.
తీర జిల్లాల్లో ఆగని వానలు

ఊపందుకున్న రుతుపవనాలు