
బెంగళూరుపై సైబర్ పడగ
బనశంకరి: సైబర్ వంచనలపైపోలీసు శాఖ ప్రజలను జాగృతి చేస్తున్నా మోసాలు ఆగడం లేదు. ప్రజల అత్యాసే వారికి అస్త్రంగా మారింది. ఫలితంగా రాష్ట్రంలో సైబర్ వంచనలు పెరిగిపోతున్నాయి. సైబర్ వంచకులు ఎక్కడో మారుమూల కూర్చొని ల్యాప్‌టాప్ ముందేసుకొని ప్రజల బ్యాంకు ఖాతాలకు కన్నం వేస్తున్నారు. 2024లో ఒకే ఏడాదిలో రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల నుంచి రూ.2.914.97 కోట్లు సైబర్ వంచకుల అకౌంట్లకు బదిలీ అయినట్లు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో మొత్తం 6,11,688 కేసులు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. నగదు పోగొట్టుకున్న బాధితుల నుంచి వెనక్కివచ్చింది కేవలం 20 శాతం కంటే తక్కువగా ఉందని పోలీస్ అధికారులు తెలిపారు.
అనేక రూపాల్లో మోసాలు
పెట్టుబడి, ఉద్యోగాలు, డిజిటల్ అరెస్ట్, పేమెంట్, భూమి, ముందస్తు నగదు చెల్లింపు, సోషల్ మీడియా, ఓఎల్‌ఎక్స్, బిజినెస్ అవకాశం, ప్రకటనలు, గిప్టు, ఏపీకే, మ్యాట్రిమోనియల్‌తో పాటు వివిధ పేర్లతో వంచకులు కస్టమర్లను వంచనకు తెగబడుతున్నారు.
ప్రభుత్వానికి సీఐడీ నివేదిక....
సైబర్ నేరాలపై అధ్యయనం చేసిన సైబర్ నేరాల విబాగం శిక్షణ, పరిశోధన కేంద్రం(సీఐడీ) ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. సైబర్ కేసుల్లో అక్రమ నగదు బదిలీకి నకిలీ అకౌంట్లు వినియోగిస్తున్నారు. వంచనకు సంబంధించి నేషనల్ సైబర్ రిపోర్టింగ్ పోర్టల్(ఎన్‌సీఆర్‌బీ)లో నమోదైన ఫిర్యాదులతో పాటు బ్యాంకింగ్ రంగంలో నియంత్రణకు రాని వంచనల గురించి నివేదిక అందించింది.
బెంగళూరు నగరంలోనే అధికం...
బెంగళూరు నగరంలో అత్యధికంగా సైబర్ వంచన కేసులు నమోదయ్యాయి. వివిధ సైబర్ పోలీస్ స్టేషన్లతో పాటు మొత్తం 19 స్టేషన్లలో 4,092 ఎఫ్‌ఐఆర్లు నమోదు కాగా మొత్తం రూ.664 కోట్లు దోచేశారు. సైబర్ నేరాల్లో 42.9 శాతం బెంగళూరు నగరంలో నమోదు కాగా ప్రైవేటు బ్యాంకుల్లో తెరిచిన నకిలీ బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.1,859.9 కోట్లు, ప్రభుత్వ బ్యాంకుల్లో ఫేక్ అకౌంట్ల నుంచి రూ.948 కోట్లు వంచనకు గురైంది.
రాష్ట్రంలో ఒకే ఏడాది రూ.2,914 కోట్లు దోచారు
ఉద్యాన నగరిలో రూ.664 కోట్లు దోచేసిన సైబర్ నేరగాళ్లు
బెంగళూరు మహానగరంలో 4092 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

బెంగళూరుపై సైబర్ పడగ

బెంగళూరుపై సైబర్ పడగ

బెంగళూరుపై సైబర్ పడగ

బెంగళూరుపై సైబర్ పడగ