
నవ వరుడి విషాదాంతం
● వివాహమైన 24 గంటల్లోనే ఆత్మహత్య
● మృతుడు జిల్లా ఆస్పత్రి ఉద్యోగి
కోలారు : వివాహమై 24 గంటల్లోనే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన బుధవారం రాత్రి కోలారులో జరిగింది. బంగారుపేటె తాలూకా నాయకరహళ్లి గ్రామానికి చెందిన హరీష్‌బాబు(33) కోలారు జిల్లా ఆస్పత్రిలోని ఈఎన్‌టీ విభాగంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.. జిల్లాస్పత్రిలోనే పని చేస్తున్న గాంధీనగర నివాసి అయిన శివరంజని కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈమేరకు బుధవారం రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కాని బుధవారం రాత్రి ఆస్పత్రి ఈఎన్‌టీ గదిలో ఉరి వేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.