యశవంతపుర: దక్షిణకన్నడ జిల్లాతో పాటు మూడు జిల్లాల పరిధిలో శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసుశాఖ అడుగులు వేస్తోంది. ఇటీవల కొత్తగా స్పెషల్ టాస్కఫోర్స్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది, అధికారులకు దక్షిణకన్నడ జిల్లా మంగళూరులో ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించారు. మతఘర్షణలు, ఉద్రిక్తత పరిస్థితులు నేలకొన్న ఘటనలో ఈ భద్రతదళాన్ని ఉపయోగించుకుంటారు. ఇందులో భాగంగా అపరేషన్ వింగ్‌లో 95 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఈ దళంలో ఇంటెలిజెన్స్‌తో పాటు సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘాను నిర్వహించేలా శిక్షణ ఇచ్చారు.
రైలు ఇంజిన్‌లో మంటలు
● ప్రయాణికులు సురక్షితం
దొడ్డబళ్లాపురం: చలనంలో ఉండగా రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఈఘటన రామనగర జిల్లా చెన్నపట్టణ వద్ద గురువారం చోటుచేసుకుంది. మైసూరు నుంచి రాజస్థాన్‌లోని ఉదయపురకు వెళ్తున్న రైలు చెన్నపట్టణ తాలూకా వందారగుప్పె వద్ద రాగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఇంజిన్ ముందు భాగంలో దట్టమైన పొగ కమ్ముకుంది. లోకోపైలట్ చాకచక్యంతో వెంటనే రైలు నిలిపివేశాడు. ప్రయాణికులను కిందకు దింపారు. అగ్నిమాపకదళం సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. అనంతరం రైలు ముందుకు కదిలింది. ఇంజిన్‌లో మంటలు చెలరేగిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
మారెమ్మదేవికి
వెన్నతో అలంకరణ
బొమ్మనహళ్లి : బొమ్మనహళ్లి నియోజకవర్గం హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ వార్డు పరంగిపాళ్య గ్రామంలో గ్రామ దేవత మారెమ్మదేవికి ఆషాఢ మాసం సందర్భంగా గురువారం విశేష అలంకరణ చేశారు. అర్చకులు వినయ్ కుమార్ దీక్షిత్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించిన అనంతరం వెన్నతో ప్రత్యేక అంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వృద్ధ మహిళా రైతు ఆత్మహత్య
మండ్య : రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం శ్రమించినా పంటలు చేతికందక అప్పుల ఊభిలో కూరుకుపోయిన వృద్ధ మహిళా రైతు బలవన్మరణం చెందింది. ఈఘటన మండ్య జిల్లా మళవళ్లి తాలూకా దేవీపుర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జవనమ్మ(75)కు భర్త చనిపోయాడు. దీంతో తనకున్న మూడు ఎకరాల పొలంలో సొంతంగా పంటలు సాగు చేస్తోంది. పెట్టుబడుల కోసం మహిళా స్వయం సేవా సంఘం, సహకార సంఘం, ప్రైవేటు బ్యాంకుల్లో దాదాపు రూ.9 లక్షల మేర అప్పులు చేసింది. అయితే ప్రకృతి విపత్తులతో పంట చేతికందలేదు. అప్పులు తీరే మార్గం కనిపించక పురుగులమందు తాగింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది.
టాస్క్‌ఫోర్స్ యాక్షన్ పోలీసులకు శిక్షణ
టాస్క్‌ఫోర్స్ యాక్షన్ పోలీసులకు శిక్షణ
టాస్క్‌ఫోర్స్ యాక్షన్ పోలీసులకు శిక్షణ