
జల సవ్వడి.. జన సందడి
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల ప్రజలకు, రైతులకు జీవనాడి అయినా తుంగభద్ర జలాశయం ఆదివారం పర్యాటకుల సందడితో కళకళలాడింది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో డ్యాం నిండు కుండల తొణికిస లాడుతోంది. శనివారం, ఆదివారం సెలవు కావడంతో ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి డ్యాం అందాలను వీక్షించారు. డ్యాంలో ఎగసి పడుతున్న అలలను, ఆస్వాదించారు. బళ్లారి, కొప్పళ రాయచూరు, చిత్రదుర్గ గదగ్‌తో పాటు తదితర జిల్లాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు.

జల సవ్వడి.. జన సందడి