ఏటీఎంలో నకిలీ నోట్ల డిపాజిట్‌ ● | - | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో నకిలీ నోట్ల డిపాజిట్‌ ●

Jun 30 2025 4:23 AM | Updated on Jun 30 2025 4:23 AM

ఏటీఎం

ఏటీఎంలో నకిలీ నోట్ల డిపాజిట్‌ ●

పదిమంది నిందితుల అరెస్ట్‌

రాయచూరురూరల్‌: ఏటీయంలోకి నకిలీ నోట్లును డిపాజిట్‌ చేస్తున్న పదిమందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాయచూరు జిల్లా మాన్విలోని ఏటీఎంలోకి ఆదివారం పదిమంది వ్యక్తులు వెళ్లారు. రూ.18 వేల నకిలీ నోట్లు డిపాజిట్‌ చేసేందుకు యత్నించారు. రూ.500 విలువైన 36 నోట్లు యంత్రంలో ఇరుక్కుపోయాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి పరిశీలించగా నకిలీ నోట్లుగా తేలింది. దీంతో రాయచూరుకు చెందిన విరుపాక్షి, శేఖర్‌, ఖాజా హుసేన్‌, కొప్పళ బీమేష్‌తో పాటు మరో అరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా గత నెలలో శేఖర్‌ నుంచి విరుపాక్షి ఖాతాకు రూ.20, 500 నకీలి నోట్లను డిపాజిట్‌ చేశారు.

ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి

రాయచూరు రూరల్‌: నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ యంకణ్ణపై చర్యలు చేపట్టాలని కర్ణాటక నాయక్‌ ఓక్కూట వేదిక అధ్యక్షుడు రవి కుమార్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. అదివారం పా త్రికేయుల భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతన విద్యా పథకం జారీ కావడంతో కన్నడ భాషతో పాటు అంగ్లం, హిందీ, ఉర్దు భాషలను తప్పకుండా నేర్చుకోవాలని ఒత్తిడి తేవడాన్ని తప్పు బట్టారు. కళాశాల, విశ్వ విద్యాలయాల నియమాలను ప్రిన్సిపాల్‌ ఉల్లఘింసున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అశ్లీల ఫొటోలు పంపి వేధింపులు

హుబ్లీ: పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నట్లు మహిళా అధ్యాపకురాలు ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శశి అనే యువకుడికి అధ్యాపకురాలితో గతంలో పరిచయం ఉంది. ఆ సమయంలో అధ్యాపకురాలి ఫొటో సేకరించాడు. అనంతరం ఆమెకు అశ్లీల వీడియోలను వాట్సాప్‌నకు పంపించి పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. లేని పక్షంలో వీడియోలు, ఫొటోలు కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కిలేడీల చేతివాటం

హుబ్లీ: బుర్కా ధరించి వచ్చిన కిలేడీలు చేతివాటం ప్రదర్శించారు. కొప్పళ జిల్లా కారటగి పట్టణంలోని వీఏ బజార్‌కు ఈ నెల 18న ఇద్దరు మహిళలు బుర్కాలు ధరించి వచ్చి చోరీలకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి.

మొహర్రంను శాంతియుతంగా ఆచరించండి

రాయచూరురూరల్‌: మోహర్రంను శాంతియుతంగా నిర్వహించుకోవాలని అడిషనల్‌ ఎస్పీ హరీష్‌ సూచించారు. ఆదివారం సదర్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన శాంతి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న మోహర్రం వేడుకులు జూలై 6 వరకు జ రుగుతాయన్నారు. హిందూ ముస్లింలు సోదరభావంతో మెలుగుతూ పండుగను ఆచరించాలన్నారు. సీఐ ఉమేష్‌ నారాయణ కాంబ్లే, యస్‌ఐలు మంజునాథ్‌, మహ్మద్‌ ఇసాఖ్‌, బసవరాజ్‌ నాయక్‌, లక్ష్మి సన్న వీరే్‌ష్‌ నాయక్‌ పాల్గొన్నారు.

ఏటీఎంలో నకిలీ నోట్ల డిపాజిట్‌ ●1
1/1

ఏటీఎంలో నకిలీ నోట్ల డిపాజిట్‌ ●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement