హలో.. లంచం త్వరగా ఇచ్చేయాలి | doctor krishna bribe demand Staff Nurse Contract Renewal Post | Sakshi
Sakshi News home page

హలో.. లంచం త్వరగా ఇచ్చేయాలి

Jun 29 2025 2:02 PM | Updated on Jun 29 2025 3:12 PM

doctor krishna bribe demand Staff Nurse Contract Renewal Post

వైద్యుడి ఆడియో లీక్‌ 

దొడ్డబళ్లాపురం(కర్ణాటక): స్టాఫ్‌ నర్స్‌ కాంట్రాక్ట్‌ రెన్యూవల్‌ చేయడానికి లంచం డిమాండ్‌ చేసిన డాక్టర్‌ ఆడియో ఒకటి వైరల్‌గా మారిన ఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా జవగొండనహళ్లిలో వెలుగు చూసింది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండేళ్లుగా పని చేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్‌ నర్స్‌ రెన్యూవల్‌ కోసం అక్కడి వైద్యుడు డాక్టర్‌ క్రిష్ణను కోరగా రూ.5వేలు లంచం అడిగాడు.

డబ్బు ఇవ్వకపోతే రేటు రూ.10వేలు అవుతుందని, ఇంకా లేట్‌ చేస్తే రూ.15వేలు అవుతుందని, ఎవరికి చెపుకున్నా తాను సంతకం పెట్టబోనని నర్స్‌ను హెచ్చరించాడు. ఈమేరకు ఆడియో లీక్‌ అయ్యి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement