సాక్షి, విజయవాడ: మద్యం సిండికేట్‌కి చంద్రబాబు ప్రభుత్వం దాసోహమైంది. వేలం లేకుండానే మద్యం షాపుల రెన్యూవల్‌కు నిర్ణయం తీసుకుంది. టీడీపీ లిక్కర్ సిండికేట్‌కి చంద్రబాబు ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. వేలం లేకుండా టీడీపీ లిక్కర్ సిండికేట్ చక్రం తిప్పింది.
స్థానిక ఎన్నికల కోసం టీడీపీ నేతలకు మద్యం షాపులు రెన్యూవల్ చేస్తూ.. ఏపీలో 3,736 మద్యం షాపులు కొనసాగించాలని నిర్ణయించింది. విచ్చల విడిగా పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసుకోవడానికి చంద్రబాబు సర్కార్ అనుమతి ఇచ్చేసింది. ప్రిన్సిపాల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.


