
విభిన్న సంస్కృతుల సమ్మేళనం ఉత్తర కన్నడ
బనశంకరి: రాష్ట్రంలో మరే ప్రాంతానికి లేనట్లుగా రాష్ట్రంలోనే అతి పెద్దదైన ఉత్తర కన్నడ జిల్లా విభిన్న సంస్కృతులు, కళలు, సంప్రదాయాలు, విలక్షణమైన జీవనవిధానంతో అలరారుతోంది. ఆధ్యాత్మికంగా, వినోద పరంగా ఈ జిల్లాకు ఎంతో పేరుంది. దట్టమైన అడవులు, నదులతో భౌగోళికంగా, ప్రకృతి పరంగా ఎంతో వైవిధ్యతను కలిగి ఉంది. వన్యజీవులు, అరుదైన పక్షులు, అనేక ఔషధ రకాల మొక్కలకు నిలయం. 140 కిలోమీటర్ల పొడవున్న సముద్రతీర ప్రాంతం కలిగిన ఈ జిల్లా పశ్చిమాన అరేబియా సముద్రం వరకు విస్తరించి పర్యాటక రంగానికి వెన్నుదన్నుగా నిలిచింది.
8.28 హెక్టార్లలో అడవులు
మొత్తం 10.25 లక్షల హెక్టార్ల భూబాగం కలిగిన ఉత్తరకన్నడ జిల్లాలో 8.28 హెక్టార్లలో అడవులు విస్తరించాయి.1.2 లక్ష హెక్టార్ల సుమారు(10)శాతం వ్యవయాసయ యోగ్యమైన భూములు ఉన్నాయి. ఉత్తరకన్నడ జిల్లాలోని కార్వార, అంకోలా, కుమటా, భట్కళ, హొన్నావర, సిద్దాపుర, శిరసి, యల్లాపుర, ముండగోడ,జోయిడా, హళియాళ, దాండేలి 12 తాలూకాలు ఉన్నాయి. ఈ జిల్లాలో జోయిడా ఆనకట్ట, కద్రా, కొడసళ్లి, గేరుసొప్ప ఆనకట్టలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. అణువిద్యుత్ ఉత్పత్తి చేసే కై గా స్థావరం పేరుగాంచింది. వర్షాకాలంలో అధిక వర్షపాతం నమోదయ్యేది ఉత్తరకన్నడ జిల్లాలోనే.
జిల్లాలో ప్రవహించే ప్రధాన నదులు
కాళి (కార్వార–జోయిడాతాలూకా), అఘనాశిని(కుమటా, శిరసి, సిద్దాపుర) శరావతి( హొన్నావర) వెంకటాపురనది(భట్కళ తాలూకా) నదులు ప్రవహిస్తున్నాయి.
ప్రముఖ ఆలయాలు
బనవాసి మదుకేశ్వర ఆలయం, ఉళవిచెన్నబసవేశ్వర, ఇడగుంజి శ్రీ సిద్దివినాయక, గోకర్ణ మహాబలేశ్వర, మురుడేశ్వర, శిరసి మారికాంబ ఆలయాలు ఆధ్యాత్మికతను పంచుతున్నాయి. జైనబసది, సోండాకోట, మిర్జాన్‌కోట ప్రాచీన స్మారకాలు. భట్కళ మసీదు ప్రధానమైంది.
విభిన్నమైన కళలు
ఉత్తరకన్నడ జిల్లాలో సుగ్గికుణిత, హోళినృత్య, పులివేషాలు, సిద్దినృత్య మొదలైనవి ప్రముఖ జానపద, సంప్రదాయకళలు. యక్షగానం పేరుగాంచిన కళగా రాష్ట్రంలో ప్రముఖమైనది.
వ్యవసాయమే ప్రధాన ఆధారం
గ్రామీణప్రాంతాల్లో నివసించే ప్రజలు వ్యవసాయంపై ఆధారపడ్డారు. ప్రధాన సంప్రదాయ వృత్తులు వ్యవసాయం, చేపలవేట, పశుపాలన, పట్టు, ఉద్యానవనాలు, తేనెటీగలు పెంపకం.
వివిధ జాతుల ప్రజలు
ఉత్తరకన్నడ జిల్లాలో సిద్ది, కుణచి, హలక్కి, ఒక్కలిగ, గొండ, గౌలి, సిద్ది ప్రజలు నివాసం ఉంటున్నారు. సుమారు 400 క్రితం ఆఫ్రికా నుంచి పోర్చుగీసు గులాములుగా వచ్చినట్లు చరిత్ర చెబుతోంది.
అందమైన సముద్ర తీరాలు
ఉత్తరకన్నడ జిల్లా పర్యాటకులను మంత్ర ముగ్దులను చేసే అనేక సముద్రతీర ప్రాంతాలకు నిలయం. కార్వార, గోకర్ణ, మురుడేశ్వర, కుమటా, అంకోలా, దేవ్‌బాగ్, ఓమ్‌బీచ్, కుడ్లేబీచ్, ప్యారడైజ్, హాప్‌మూన్, తిలమట్టి, రవీంద్రనాద్‌ఠాగూర్, కాసరగూడుబీచ్, మజాలీబీచ్‌లు ప్రధానమైనవి. హండిగోన్, హువినహొళే, కడ్లేబీచ్, ఎకోబీచ్, నిర్వాణాబీచ్‌లు ఉన్నాయి. ఉంచళ్లి, సాదోడి, మాగోడు, శరావతి, విభూతి,యాణ జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
రమణీయమైన పర్యాటక ప్రాంతాలు
అందమైన సముద్ర తీరాలు
దట్టమైన అడవులు

విభిన్న సంస్కృతుల సమ్మేళనం ఉత్తర కన్నడ

విభిన్న సంస్కృతుల సమ్మేళనం ఉత్తర కన్నడ

విభిన్న సంస్కృతుల సమ్మేళనం ఉత్తర కన్నడ