దారపు నరాలు..ఇట్టే నయం..! | Health Tips: Sclerotherapy: Treatment for Varicose and Spider Veins | Sakshi
Sakshi News home page

దారపు నరాలు..ఇట్టే నయం..!

Jun 22 2025 1:24 PM | Updated on Jun 22 2025 1:24 PM

Health Tips: Sclerotherapy: Treatment for Varicose and Spider Veins

చర్మంపై నరాలు తేలి అవి పైకి కనిపిస్తే అందవిహీనంగా కనిపిస్తుంది. నిజానికి ఈ సమస్యను దారపు నరాలు లేదా స్పైడర్‌ వీన్స్‌ అంటారు. ఇవి ఎక్కువగా కాళ్లు, తొడల భాగాల్లో నరాలు చర్మంపైకి నల్లటి లేదా ఎర్రటి చారల్లా కనిపిస్తాయి. సమస్య తీవ్రతను బట్టి అవి ముఖంపై కూడా వస్తుంటాయి. వాటికి సమర్థమైన చికిత్స ‘లిక్విడ్‌ స్క్లెరో థెరపీ’. ఈ ప్రక్రియలో, ఒక ప్రత్యేక రసాయనిక ద్రావణాన్ని, నేరుగా ప్రభావిత నరంలోకి ఇంజెక్ట్‌ చేస్తారు. 

చిన్న చారల నుంచి మధ్యస్థాయి చారల వరకు, ఈ చికిత్స చేస్తే ఫలితం ఉంటుంది. చాలామందికి ఒకటి కంటే ఎక్కువ సెషన్స్‌ అవసరం కాకపోవచ్చు. చికిత్స తర్వాత స్వల్ప అసౌకర్యం, వాపు ఉండవచ్చు కాని, అదంతా త్వరగా తగ్గిపోతుంది. ఈ థెరపీ చాలా సురక్షితం.

చర్మ సౌందర్యానికి, జుట్టు ఆరోగ్యానికి వేర్వేరు పరికరాలను ఉపయోగిస్తున్నారా? ఇక ఆ అవసరం లేదు. ‘మైట్రెక్స్‌ ప్రూవ్‌ టోటల్‌ లిఫ్ట్‌’ అనే ఈ పరికరంలో ముఖం, తల, శరీర సంరక్షణకు అవసరమైన అన్ని ఫీచర్స్‌ కలిగి ఉంది. ఇది ఎలక్ట్రిక్‌ మజిల్‌ స్టిమ్యులేషన్‌తో హై పవర్‌ పల్స్‌తో చర్మాన్ని ఉత్తేజపరచి, కండరాలను బలోపేతం చేస్తుంది. దాంతో చర్మాన్ని బిగుతుగా మార్చి, నిగారింపునిస్తుంది.

అలాగే ఈ మెషిన్‌ మూడు విభిన్న అటాచ్‌మెంట్‌లతో రూపొందింది. దీనికున్న బ్రష్‌ అటాచ్‌మెంట్‌ తలకు మసాజ్‌ చేసి, జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తుంది. దీని కర్వ్‌డ్‌ అటాచ్‌మెంట్‌ ముఖంపై చర్మాన్ని బిగుతుగా మార్చి, ముడతలను నివారిస్తుంది. ఫ్లాటర్‌ అటాచ్‌మెంట్‌ శరీర భాగాలైన చేతులు, కాళ్లు వంటి వాటిపై చర్మాన్ని మెరుగుపరుస్తుంది.

ఇది వాటర్‌ప్రూఫ్‌ డివైస్‌ కావడంతో తడి చర్మంపై కూడా సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. దీనిలో ఐదు లెవల్స్, రెండు మోడ్స్‌ ఉండటంతో అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. దీనికి ఒక్కసారి చార్జ్‌ పెడితే 7 నుంచి 11 గంటల వరకు పనిచేసే బ్యాటరీ సామర్థ్యం, నిరంతరాయంగా పని చేస్తుంది. 15 నిమిషాల తర్వాత ఆటో–ఆఫ్‌ టైమర్‌ ఉండటంతో దీనిని వినియోగించడం చాలా తేలిక. 

(చదవండి: ముప్పై ఐదేళ్లు దాటాక ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేయడం ప్రమాదమా...?)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement