
బస్టాండ్‌ను స్వచ్ఛంగా ఉంచండి: కలెక్టర్
హొసపేటె: జిల్లా కలెక్టర్ ఎంఎస్ దివాకర్ నగరంలోని కేంద్ర బస్టాండ్‌ను ఆదివారం తనిఖీ చేశారు. బస్టాండ్‌లో ఉన్న అపరిశుభ్రతను చూసి అధికారులపై మండిపడ్డారు. బస్టాండ్‌ను స్వచ్ఛంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తర్వాత ప్లాట్‌ఫారంపై ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి తినుబండారాలు, వాటర్ బాటళ్ల గడువు తేదీని తనిఖీ చేశారు. అనంతరం వాటర్ ప్లాంట్‌ను పరిశీలించారు.ప్రయాణికులకు స్వచ్ఛమైన నీటిని అందించాలని ఆదేశించారు. బాత్‌రూమ్‌కు వెళ్లాలంటే రూ.10 వసూలు చేస్తున్నట్లు మహిళా ప్రయాణికులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన అధికారులపై మండిపడ్డారు. కేవలం రూ. 3 మాత్రమే తీసుకోవాలని ఆదేశించారు. ప్రయాణికులకు అన్ని విధాలా మౌలిక సౌకర్యాలను కల్పించాలని సూచించారు. హుడా అధ్యక్షుడు ఇమామ్ నియాజీ, అధికారులు రాజశేఖర్ వాజంత్రి, వార్త సమాచార అధికారి ధనుంజయ పాల్గొన్నారు.

బస్టాండ్‌ను స్వచ్ఛంగా ఉంచండి: కలెక్టర్