రెండు కార్లలో వెంటాడి ఇద్దరినీ కిడ్నాప్‌..! | Newly Married Couple Kidnap Attempt | Sakshi
Sakshi News home page

రెండు కార్లలో వెంటాడి ఇద్దరినీ కిడ్నాప్‌..!

Jun 29 2025 9:33 AM | Updated on Jun 29 2025 12:26 PM

Newly Married Couple Kidnap Attempt

దొడ్డబళ్లాపురం(కర్ణాటక): పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న తమను కిడ్నాప్‌ చేసేందుకు యత్నంచారని నవ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనేకల్‌ తాలూకా చందాపుర వద్ద చోటుచేసుకుంది. సంజయ్, దివ్య ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 

పెళ్లికి పెద్దలు వ్యతిరేకించడంతో 15 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈక్రమంలో దివ్య తల్లి కాల్‌ చేసి మీ నాన్నకు ఆరోగ్యం బాగాలేదని, జయదేవ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశామని, చూసివెళ్లమని కోరింది. దీంతో సంజయ్, దివ్యలు బైక్‌పై ఆస్పత్రికి వెళ్తుండగా బొమ్మసంద్ర నివాసి శోభ, ఆమె గ్యాంగ్‌ సభ్యులు   రెండు కార్లలో వెంటాడి ఇద్దరినీ కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించారు అయితే నవదంపతులు వారిబారి నుండి తప్పించుకొని సూర్యా నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement