
జూన్‌లోనే.. కావేరి నీటి విడుదల
మైసూరు: కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వరదాయినిగా పేరుపొందిన కావేరి నది మంగళవారం మండ్య జిల్లాలోని కేఆర్‌ఎస్ జలాశయం నుంచి పరుగులు తీసింది. ఎగువన వర్షాలతో భారీగా ప్రవాహం చేరడం వల్ల అధికారులు గేట్లను ఎత్తారు. 30 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. ఆ నీరు తమిళనాడుకు వెళ్తుంది. జూన్‌లోనే డ్యాం నీటిని విడుదల చేయడం కేఆర్‌ఎస్ చరిత్రలో 2 సార్లు మాత్రమే జరిగిందని ఇంజినీర్లు తెలిపారు. 1932లో డ్యాం నిర్మాణం పూర్తయింది. 1941లో ఏకధాటి వానల వల్ల జూన్‌లో నీటిని వదిలారు. మళ్లీ ఇప్పుడు అలా జరిగిందని చెప్పారు. కాగా, నదికి అటు ఇటు ఉన్న గ్రామాల ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. డ్యాం నుంచి నురగలు కక్కుతూ నది పరవళ్లు తొక్కుతోంది.
కేఆర్‌ఎస్ గేట్లు ఎత్తివేత