అపార్టుమెంటులో యువతి క్షుద్ర పూజలు | Bengaluru Dog Incident | Sakshi
Sakshi News home page

అపార్టుమెంటులో యువతి క్షుద్ర పూజలు

Jun 29 2025 12:21 PM | Updated on Jun 30 2025 9:41 AM

Bengaluru Dog Incident

అపార్టుమెంటులో బెంగాలీ మహిళ అకృత్యం

బనశంకరి(కర్ణాటక): క్షుద్ర పూజల కోసం ఓ మహిళ పెంపుడు శునకాలను హత్యచేసిన ఘటన వెలుగుచూసింది.  పశ్చిమ బెంగాల్ కు చెందిన మహిళ  బెంగళూరు మహదేవపుర చిన్నప్పలేఔట్‌లోని అపార్టుమెంట్‌లో ఉంటోంది. త్రిపర్ణ పైక్‌ అనే మహిళ 4 లేబ్రడార్‌ పెంపుడు కుక్కలను నాలుగురోజులు క్రితం గొంతుకోసి  హతమార్చింది.

ఆమె ఫ్లాటులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం అందించారు.  మహదేవపుర పోలీసులు, బీబీఎంపీ సిబ్బంది చేరుకుని చూడగా కుక్కల కళేబరాలు కనిపించాయి. మొదట వారు ఇంట్లోకి రావడానికి ఆ మహిళ అంగీకరించలేదు. ఆత్మహత్య చేసుకుంటానని నానా యాగీ చేసింది. చివరకు లోపలకు వెళ్లి చూడగా దారుణమైన దృశ్యాలు కనిపించాయి. 

చచ్చిపోయిన కుక్కలు, రకరకాల పూజల దృశ్యాలు చూసి హడలిపోయారు. కళేబరాలను శవ పరీక్షల కోసం పశువుల ఆసుపత్రికి తరలించారు. వాటిని చాకుతో కోసి చంపారని నివేదికల్లో వచ్చింది. సదరు మహిళ చేతబడి   కోసం కుక్కలను చంపి వాటి రక్తంతో పూజలు చేసి ఉంటుందని అనుమానాలు ఉన్నాయి.  మరో 2 కుక్కలను కాపాడి తరలించారు. మహిళపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. 

Advertisement
 
Advertisement
Advertisement