
నియామక పరీక్షల శిక్షణకు విజ్ఞప్తి
బళ్లారిఅర్బన్: ఎన్‌ఎండీసీలో నియామకాల కోసం పరీక్షలకు సిద్ధతా శిక్షణ గురించి వినతిపత్రాన్ని జిల్లాధికారి కార్యాలయంలో తహసీల్దార్‌కు అందజేశారు. ఎన్‌ఎండీసీ పరీక్ష అభ్యర్థులు తమ సమస్యను వినతిపత్రంలో వివరించారు. గత మార్చిలో నియామకమైన ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల సిద్ధతా శిక్షణ శిబిరాన్ని దోణిమలైలోని ప్రభుత్వ హైస్కూల్‌లో గత నెల 30 నుంచి ఈనెల 8 వరకు జరుపుతామని ప్రకటన ఇచ్చారన్నారు. అయితే అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరైన కారణంగా శిక్షణ శిబిరాన్ని వాయిదా వేశారన్నారు. దీంతో బళ్లారి వాసులకు బళ్లారిలోనే శిక్షణా తరగతులు ఏర్పాటు చేసేలా విజ్ఞప్తి చేస్తున్నామని విద్యార్థులు సురేష్, విజయ్‌కుమార్, పల్లవి, ఈశ్వరి అరిణి, రాజేశ్వరి, సాగర్, రాయాపుర లక్ష్మణ్, పంపాపతి, మహంతేష్, రాజేష్, రుద్రముని, గాదిలింగప్ప తదితరులు తెలిపారు.