
9న దూర తీరయాన చిత్రం ప్రత్యేక ప్రదర్శన
హుబ్లీ: డీ క్రియేషన్స్ వారి దూర తీరయాన చిత్రం ప్రత్యేక ప్రదర్శన ఈనెల 9న సాయంత్రం 4 గంటలకు ధార్వాడ పద్మ థియేటర్‌లో ఏర్పాటు చేశామని ఆ చిత్ర దర్శకుడు మన్సూరే తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇది ప్రేమ కథ అని, హీరోగా విజయ్ కృష్ణ, హీరోయిన్‌గా ప్రియాంక కుమార్ నటించారని తెలిపారు. శృతి హరిహరన్, శరత్ లోహితాశ్వ, సుధా బెళవాడి, అరుణ్‌సాగర్, శోభరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రంలో 6 పాటలు ఉన్నాయి. కార్తీక్, భక్కేష్ సంగీత దర్శకత్వం నిర్వహించారు. బెంగళూరు, ఉడిపి, కుందాపుర, గోవాల్లో షూటింగ్ చేశామన్నారు. ప్రత్యేక ప్రదర్శన బెంగళూరు, మైసూరుకు మాత్రమే పరిమితం అయిందన్నారు. అయితే కన్నడ సినీ రంగానికి ఉత్తర కర్ణాటక ఇచ్చిన సేవలు అనన్యం అని, అందుకే ధార్వాడలో ఈ ప్రత్యేక ప్రదర్శన చేశామన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దేవరాజ్, పంపిణీదారులు రవిచంద్ర రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వృక్ష సంపద భద్రతకు
చర్యలు చేపట్టండి
బళ్లారి అర్బన్: మొహర్రం పండుగ వేళ జిల్లా వ్యాప్తంగా ఆయా తాలూకాల పరిధిలో అగ్నిగుండం తయారీ కోసం వృక్షాలను నాశనం చేయరాదు. ఎండుకట్టెలతో పండుగను జరుపుకొనేలా అవగాహన కల్పించాలని, ఎట్టిపరిస్థితిలోను పచ్చని చెట్లను నాశనం చేయకుండా చర్యలు చేపట్టాలని జిల్లాధికారికి కర్ణాటక రక్షణ వేదిక బళ్లారి జిల్లా శాఖ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సంస్థ ఆధ్వర్యంలో జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. మొహర్రం పండుగ మతాల మధ్య సామరస్యానికి ప్రతీక అన్నారు. హిందువులు, ముస్లింలు కలిసి ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారన్నారు. ఈ పండుగ సందర్భంగా పచ్చని చెట్లు చేమలకు హాని వాటిల్లకుండా పోలీసులు సంబంధిత అధికారులు పండుగ నిర్వాహకులకు అవగాహన కల్పించి వారిని చైతన్య పరచాలని సంస్థ అధ్యక్షుడు పంపనగౌడ కోరారు. లింగేశ్వర్, అంజినమ్మ, ఆంజినేయ, శేఖర్, హులిగప్ప తదితరులు పాల్గొన్నారు.
కవి మృతికి సంతాపం
రాయచూరు రూరల్: నగరంలో సీనియర్ కవి బీ.వీ.వాల్మీకి నాగేంద్ర అకాల మృతికి రంగస్థల కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు మంగళవారం కన్నడ భవనంలో జరిగిన సమావేశంలో సీనియర రంగస్థల కళాకారుడు హక్కి మాట్లాడుతూ రంగాయణ, కళా రంగం, కవిత్వంలో రాటు దేలిన నాగేంద్ర వాల్మీకిగా పేరొందారని అభివర్ణించారు. కార్యక్రమంలో అయ్యనగౌడ, వెంకటేష్, బషీర్ అహ్మద్, నరేంద్ర రంగస్వామిలున్నారు.
ఆ ప్రకటన ఖండనీయం
హొసపేటె: సోషలిజం, లౌకికవాదం అనే పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన దత్తాత్రేయ హొసబాళె చేసిన ప్రకటనను అఖిల భారత బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అసోసియేషన్ నాయకుడు ఎం.కరుణానిధి తెలిపారు. మంగళవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సంఘ్ పరివార్ తన రహస్య ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. అంబేడ్కర్ పేరును ముందుకు తేవడం ద్వారా దేశ ప్రజల్లో కుల విద్వేషాన్ని నాటడానికి కూడా ప్రయత్నిస్తోందన్నారు. అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రు 1946 డిసెంబర్ 13న ఒక సంకలిత తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా, అది 1947లో ఆమోదం పొందిందన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగంలో చేర్చారన్నారు. అనంతరం అసోసియేషన్ నాయకుడు మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ కూడా కుల రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

9న దూర తీరయాన చిత్రం ప్రత్యేక ప్రదర్శన

9న దూర తీరయాన చిత్రం ప్రత్యేక ప్రదర్శన