
ఆటోవాలాలపై ట్రాఫిక్ కొరడా
రాయచూరు రూరల్: నగరంలో ఎలాంటి అనుమతులు లేని 300 ఆటోలకు చెక్ పెట్టినట్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఈరేష్ నాయక్ వెల్లడించారు. మంగళవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రధాన రహదారిలో ఆటోల తనిఖీ చేపట్టి డ్రైవర్లకు లైసెన్సులు, పర్మిట్లు, ఆర్‌సీ, ఇతర బ్యాడ్జీలు లేని వాటన్నింటిని పట్టుకుని సీల్ వేసినట్లు తెలిపారు. నగరంలో దాదాపు 75 శాతం ఆటోలకు ఎలాంటి బీమా ఇతరత్ర పత్రాలు లేవని ఆయన అన్నారు.
చెరువులో మొసలి పట్టివేత
రాయచూరు రూరల్: తాలూకాలోని మర్చేడ్ చెరువులో మొసలి ప్రత్యక్షం కాగా అటవీ శాఖ అధికారులకు అప్పగించిన ఘటన తాలూకాలో చోటు చేసుకుంది. చెరువులో మొసలి ప్రత్యక్షం కావడంతో ప్రజలు భయాందోళన చెందారు. గ్రామంలోని యువకులు ఏకమై చేపలు పట్టే వలతో మొసలిని పట్టుకొని అటవీ శాఖ అధికారులకు అప్పగించడంతో గ్రామ ప్రజలు ఊరట చెందారు.
పాము కాటుకు
తల్లీకొడుకు మృతి
రాయచూరు రూరల్: పాము కాటుకు గురై తల్లీకొడుకు మృతి చెందిన ఘటన జిల్లాలోని దేవదుర్గ తాలూకాలో చోటు చేసుకుంది. దేవదుర్గ తాలూకా ఏరుండి గ్రామంలో సోమవారం రాత్రి ఇంటిలో నిద్రిసున్న సమయంలో వీరిని పాము కరిచింది. వారిని ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ తల్లి సుబ్బమ్మ(35), బసవరాజ్(10) మరణించారు.
రిమ్స్‌లో బాలుడి అపహరణ
రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన బాలుడు కిడ్నాప్‌కు గురైన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది. రాయచూరు తాలూకా జులుంగేర తాండాకు చెందిన విష్ణు నాయక్(10)కు చేతులు కాలడంతో గత నెల 17న ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే ఆ బాలుడిని గత నెల 22న కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై మార్కెట్ యార్డు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాబయ్య తెలిపారు.
కార్మికుల సమస్యలు తీర్చండి
రాయచూరు రూరల్: హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలపై అధికారులు స్పందించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బషీర్ పేర్కొన్నారు. మంగళవారం హట్టి పైభవనంలో జరిగిన సభలో కార్మికుల నుద్దేశించి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కార్మికుల జీవితం కష్టకరంగా మారిందన్నారు. కేంద్రం కార్మికుల హక్కులను హరిస్తోందన్నారు. సమావేశంలో రమేష్, ఫకృద్దీన్, వెంకటేష్, పెంచలయ్య, సాహీరా బేగంలున్నారు.
ఎయిమ్స్ మంజూరుకు కమిటీ ఏర్పాటు తగదు
రాయచూరు రూరల్: దేఽశంలో కేంద్ర సర్కారు ఆధీనంలో మంజూరు అవుతున్న విద్యా సంస్థలకు కమిటీ అధ్యయనం చేస్తుందని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొనడాన్ని బసవేశ్వర క్రాంతికారి సంఘం అధ్యక్షుడు రాజేష్ తప్పు బట్టారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మంగళగిరి, తెలంగాణలో బీబీనగర్, జమ్మూకశీ్‌మ్‌ర్‌లో విజయనగర్‌ల్లో ఎయిమ్స్, కశ్మీర్ అవంతికల్లో ఫోరోనిక్స్ విశ్వవిద్యాలయం మంజూరుకు కమిటీలు పరిశీలన చేశాయా? అని ప్రశ్నించారు. ఆ ప్రాంతాలకు లేని మార్గదర్శకాలు కర్ణాటకలోని రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటుకు రూపొందిస్తామనడం అపహాస్యంగా ఉందన్నారు.

ఆటోవాలాలపై ట్రాఫిక్ కొరడా

ఆటోవాలాలపై ట్రాఫిక్ కొరడా

ఆటోవాలాలపై ట్రాఫిక్ కొరడా

ఆటోవాలాలపై ట్రాఫిక్ కొరడా

ఆటోవాలాలపై ట్రాఫిక్ కొరడా