
ఏఐఐఈఏ ప్లాటినం మహోత్సవం
బళ్లారి రూరల్ : ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐఐఈఏ) 75 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా మంగళవారం ఎల్‌ఐసీ బ్రాంచ్–2లో ప్లాటినం మహోత్సవాన్ని ఆచరించారు. ఏఐఐఈఏ జెండాను ఆవిష్కరించి జ్యోతిప్రజ్వలనం చేశారు. ఈసందర్భంగా కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ సంపత్ కుమార్, ఏబీఎం ఐ.కె.గోపాల్, ఏఐఐఈఏ అధ్యక్షుడు ఆర్.దత్తాత్రేయ, కార్యదర్శి కామ్రేడ్ సూర్యనారాయణ, డీఓ శశిధర్, ఏజెంట్ కొట్రేశ్, బీఎఫ్‌ఐ, ఏయూయూటీయూసీ, కర్ణాటక గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.