భర్తను కాదని భార్య వేరే యువకుడితో.. | married woman ends life in karnataka | Sakshi
Sakshi News home page

భర్తను కాదని భార్య వేరే యువకుడితో..

Jun 26 2025 7:00 AM | Updated on Jun 26 2025 7:00 AM

married woman ends life in karnataka

కర్ణాటక: ఓ యువకుడు తమ ప్రియురాలిని చంపి తన పొలంలోనే మృతదేహాన్ని పాతిపెట్టిన అమానుష ఘటన జిల్లాలోని కరోటి గ్రామంలో జరిగింది. హాసన జిల్లా హొసకొప్పలు గ్రామానికి చెందిన ప్రీతి అనే యువతి హత్యకు గురైంది. పునీత్‌ అనే యువకుడే హత్య చేసిన నిందితుడు. ప్రీతికి  వివాహమై పిల్లలున్నా పునీత్‌ వెంటపడింది. గత ఆదివారం మండ్య, మైసూరులకు ట్రిప్‌ వెళ్లిన ఇద్దరూ జాలీ జాలీగా సమయాన్ని గడిపారు. 

ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు. కేఆర్‌ పేటె కత్తరఘట్ట అడవిలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత పునీత్‌ ఆమెను చంపి బంగారు ఆభరణాలను దోచుకుని ఆమె మృతదేహాన్ని తమ పొలంలోనే పాతిపెట్టి పరారయ్యాడు. ప్రీతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పునీత్‌ పట్టుబడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పునీత్‌ జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. ప్రీతి పెళ్లయి పిల్లలు ఉన్నా పునీత్‌ వెంటపడి  తనువు చాలించగా  తల్లిని కోల్పోయి పిల్లలు అనాథలయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement