
నేడు దేవెగౌడ ప్రతిమ ఆవిష్కరణ
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గలో శుక్రవారం ప్రజలతో జనతాదళ్ జాతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ తెలిపారు. గురువారం దేవదుర్గలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దేవదుర్గ తాలూకా చిక్క హొన్నకుణి వద్ద రైతు మల్లనగౌడ నాగరాళ, గ్రామస్తులు అభిమానంతో తయారు చేసిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ ప్రతిమను మాజీ ప్రధాని దేవెగౌడ శుక్రవారం ఆవిష్కరిస్తారన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి జేడీఎస్ పార్టీకి పూర్వవైభవం తేవడానికి మాజీ ప్రధాని దేవెగౌడ చేస్తున్న అవిశ్రాంత పోరాటానికి విజయం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేవెగౌడ ప్రతిమను నిర్మించిన దాతలను సన్మానిస్తున్నట్లు తెలిపారు.