
రోడ్డెక్కిన మామిడి రైతులు
కోలారు: మామిడి రైతులకు సహాయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయడం లేదని ఆరోపిస్తూ మామిడి రైతులు, వ్యాపారులు మళ్లీ నిరసనకు దిగారు. నగర శివార్లలోని కొండరాజనహళ్లి సమీపంలో బెంగళూరు– చైన్నె హైవేలో మామిడి పండ్లను పోసి రోడ్డును దిగ్బంధించారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలో పోలీసులు అడ్డుకోవడంతో మీకు రైతుల బాధ అర్థం కాలేదా అని ప్రశ్నించారు. జిల్లా మామిడి రైతుల అధ్యక్షుడు నీలతూరి చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ మామిడి ధర అత్యల్ప స్థాయికి పడిపోయిందని, రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనట్లు తోతాపురికి మార్కెట్‌లో డిమాండ్ పడిపోయింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లని మద్దతు ధరను జారీ చేయడం లేదని దుయ్యబట్టారు.
మామిడికి పరిహారధనం
బనశంకరి: కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు పరిహారం ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ.. ప్రతి టన్ను మామిడికి రైతుకు రూ.1616 పరిహారం ప్రకటించింది. రాష్ట్రంలో 2,50,000 మెట్రిక్ టన్నుల మామిడికి పరిహార ధనం అందుతుందని కేంద్రమంత్రి హెచ్‌డీ.కుమారస్వామి తెలిపారు.
మామిడిని రోడ్డుపై పడేసి ఆందోళన