హెలికాప్టర్‌ నుంచి రూ. 4 లక్షలు పైనే డబ్బుల వర్షం..! | Viral Video: Thousands of dollars and rose petals dropping from a helicopter | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్‌ నుంచి రూ. 4 లక్షలు పైనే డబ్బుల వర్షం..! రీజన్‌ తెలిస్తే మండిపడతారు

Jul 2 2025 3:48 PM | Updated on Jul 2 2025 4:43 PM

Viral Video: Thousands of dollars and rose petals dropping from a helicopter

కొందరు సాయం, దాతృత్వం వంటి పదాలకు కొత్త అర్థాలు ఇస్తారు. అది దానం చేసినట్లు మనల్ని అవమానిస్తున్నట్లు కూడా అర్థం కాదు. చూడటానికి తమ డాబు దర్పం చూపించుకోవడానికి చేసిన దానదర్శంలా ఉంటుంది. ఇక్కడొక వ్యక్తి తన తన అంత్యక్రియల తంతులో వేలాదిగా డబ్బు పేద ప్రజలకు పంచాలనేది అతడి కోరికి. అతన ఆలోచన బాగానే ఉన్నా ఇచ్చిన విధానం చూస్తే..ఎవ్వరికైన చిర్రెత్తుకొస్తుంది. ఇదేం దాతృత్వం రా బాబు అని నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.

డెట్రాయిట్‌కి చెందిన 58 ఏళ్ల డారెల్ ప్లాంట్ థామస్ తన అంత్యక్రియల సమయంలో పేద ప్రజలకు ఎంతో కొంత డబ్బు సాయం చేయాలనేది అతడి కోరిక. సమాజం తనను చిరకాలం గుర్తించుకునేలా తన దానం ఉండాలని ఆశించాడు. ఆయన గత నెల జూన్‌ 27న తుదిశ్వాస విడిచారు. దాంతో అతడి కొడుకులు డేరెల్‌, జోంటే ఇద్దరు తండ్రి కోరకి మేరకు హెలికాప్టర్‌ ఏర్పాటు చేసి మరీ గులాబి రేకుల తోపాటు సుమారు రూ. 4 లక్షల పైన నగదును ఆకాశం నుంచి వర్షంలా కురిపించారు. 

దాంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడి ప్రజజీవనం స్థబించిపోయింది. అంతేగాదు ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే ఆ నగదు, గులాబి పూరేకులు పడిన రహదారిని మొత్తం మూసేశారు కూడా. రోడ్లపైనే పాదాచారులు, వాహనదారులు గులాబి రేకుల తోపాటు పడుతున్న నగదును తీసుకోవడానికి రావడంతో ఒక్కసారిగా పరిస్థితి అంతా గందరగోళంగా మారింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఇలా ఒకవైపు రహదారిని మొత్తం మూసేసింది. 

అయితే అధికారులు గులాబి రేకులు మాత్రమే అనుకున్నారట..ఇలా డబ్బుల వర్షం కురిసినట్లు తెలియదని చెబుతుండటం గమనార్హం. అయితే పోలీసులు ఆ డబ్బులను ఏమి స్వాధీనం చేసుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ పలువురు మాత్రం ఇది దాతృత్వంలా లేదని. ఇది సరైన విధానం కాదని మండిపడ్డారు. అలాగే యూఎస్‌ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ఘటనపై సీరియస్‌గా దర్యాప్తు చేస్తోంది. 

 

(చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement