
నిండా 25 ఏళ్లు లేవు కానీ ఓ దేశానికి అధ్యక్షుడిగా పాలిస్తున్నాడు . అది కూడా స్వయం ప్రకటిత దేశం. ఆ దేశానికి స్వంతంగా జెండా, కేబినేట్, స్వతం కరెన్సీ కూడా ఉంది. ఇదంతా ఎక్కడ..? అంత చిన్న వయసులోనే అధ్యుకుడైన ఆ టీనేజర్ ఎవరు అంటే..?..
స్వయం ప్రకటిత దేశానికి అధ్యుడిగా ఉన్న ఆ వ్యక్తి డేనియల్ జాక్సణ. బ్రిటన్‌కి చెందినవాడు, ఆస్ట్రేలియా మూలాలు ఉన్న వ్యక్తి. ఆ దేశం పేరు ఫ్రీ రిపబ్లిక్ ఆఫ్ వెర్డిస్ అత్యంత ఆసక్తికర విసయం ఏంటంటే 18 ఏళ్ల వయసులోనే సొంతంగా ఓ దేశాన్ని క్రియేట్ చేసి తానే అధ్యక్షుడిగా ఉండాలని కలలు కనేవాడట. అలా క్రొయేషియా, సెర్బియా దేశాల మధ్య ఉన్న వివాదాస్పద భూమిని తన రాజ్యంగా ఎంచుకుని స్వయం ప్రకటిత దేశంగా మార్చాడు.
వృత్తి రీత్యా డిజిటల్ డిజైనర్, గేమింగ్ ఫ్లాట్‌ఫామ్ రోబ్లాక్స్‌లో వర్చువల్ ప్రపంచాన్ని సృష్టించి వేతనం పొందేవాడు. అలాంటి ఈ వ్యక్తి ఈ వెర్రీ ఆలోచనతో మే 30, 2019న ఆ రెండు దేశాల మధ్య ఉండే వెర్రిస్ అనే ఈ వివాదాస్పద భూమిని స్వతంత్ర రిపబ్లిక్ దేశంగా ప్రకటించాడు.
డానుబే నది ఒడ్డున దాదాపు 125 ఏకరాల్లో ఈ దేశం ఉంది. ఈ దేశానికి స్వంత జెండా, కేబినేట్, స్వంత కరెన్సీతో సహా సుమారు 400 మంది రిజిస్టర్ పౌరులు కూడా ఉండటం విశేషం. ఈ చిన్న దేశాన్ని స్థానికంగా 'పాకెట్ త్రీ' అని కూడా పిలుస్తారు.
ఊహకందని విధంగా నిర్బంధం, బహిష్కరణ..
హాయిగా అధ్యక్షుడి సాగిపోతున్న డేనియల్‌కి అక్టోబర్ 2023లో క్రొయేషియా దేశం నుంచి ఊహించని షాక్ తగిలింది. ఆ చిన్న దేశంలోని ఉంటున్న కొందరు స్థిరనివాసులను, ఆ దేశ అధ్యక్షుడిగా చెప్పుకునే డేనియల్‌ని క్రోయేషియా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడిని దేశం నుంచి బహిష్కరించారు.
ఇంత జరిగినా డేనియల్ తన చిన్న దేశాన్ని రిమోట్‌గా నడుపుతూనే ఉన్నాడు. క్రొయేషియా తనను జాతీయ భద్రతకు ముప్పు అని చెప్పి.. బహిష్కరించారని చెబతున్నాడు డేనియల్. అంతేగాదు తాను ఏదోలా క్రోయేషియా దేశంతో శాంతియుతంగా ఒప్పందం చేసుకుని..ఈ చిన్న దేశాన్ని అధికారికంగా ప్రకటించేలా చేస్తానని నమ్మకంగా చెబుతున్నాడు.
ఆ చర్చలు సఫలమై తన దేశం అధికారికంగా ప్రకటించబడిన వెంటనే తాను అధికారం నుంచి తప్పుకుంటానని కూడా అంటున్నాడు. తానొక సాధారణ పౌరుడిగానే ఉంటానని చెబుతున్నాడు. అదీగాక ఇది తాను సృష్టించిన దేశమే కాబట్టి దీన్ని చూసి గర్విస్తుంటానని, తనకు అదే చాలని గొప్పగా చెబుతున్నాడు డేనియల్.
ఈ చిన్న దేశంలో పౌరసత్వం కోసం..
ఇక డేనియల్ సృష్టించిన ఈ దేశానికి పౌరుడిగా మారాలంటే..వైద్యం లేదా పోలీసింగ్ అనుభవం వంటి నైపుణ్యాలు ఉంటే చాలట. దెబ్బకు సులభంగా ఆ దేశ పౌరసత్వం లభించేస్తుందట. అలాగే తమ దేశానికి చేరుకోవడానికి ఏకైక మార్గం క్రొయేషియా నగరం ఒసిజెక్ నుంచి పడవ మార్గం ద్వారా చేరుకోవాలట.
(చదవండి: దుకాణం నడుపుతున్న ఏడేళ్ల చిన్నారి..! బెస్ట్ పేరెంటింగ్ పాఠం)