
నిమ్మరసం దుకాణం నడుపుతున్న ఏడేళ్ల చిన్నారి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అలా ఎందుకు అమ్ముతుందో పాపం అనుకునేలోపు ఆశ్చర్యం కలిగించేలా ఆర్థిక పాఠాల గురించి బెబుతోంది ఆ చిన్నారి. ప్రతి తల్లిదండ్రులు ఇలా ఉంటే పిల్లలు వృద్ధిలోకి వస్తారని కళ్లకుకట్టినట్లు చూపించే బెస్ట్ పేరెంటింగ్ పాఠం ఇది. సమాజానికి ఇలాంటి తలిదండ్రులే అవసరం అని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.
ఆ వీడియోలో ఏడేళ్ల చిన్నారి ఒక వీధిలో నిమ్మరసం అమ్ముతూ కనిపిస్తుంది. ఆ చిన్నారి తోపాటు అమ్మమ్మ, తండ్రి కూడా ఉన్నారు. దీన్ని కంటెంట్ క్రియేటర్ పూర్వ ఘరత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కంటెంట్ క్రియేటర్ పూర్వ ఆ చిన్నారి ఇలా దుకాణం నడపడాన్ని గమనించి వారి అనుమతితోనే ఈ వీడియో తీస్తోంది.
అసలు ఆ చిన్నారి ఇలా ఎందుకు చేస్తుందని ఆమె అమ్మమ్మను, తండ్రిని అడుగుతుంది. ఆ తండ్రి మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం చదివారా అని ప్రశ్నిస్తాడు. తన కూతురు ఆ పుస్తకం నుంచి ప్రేరణ పొంది ఇలా వ్యాపారం మొదలు పెట్టిందని వివరిస్తాడు. ఆ పస్తకం నుంచి తెలుసుకున్నదాన్ని నేర్చుకునేలా ఇలా ఆచరణలో పెట్టించానని చెబుతాడు ఆ తండ్రి.
అది విని కంటెంట్ క్రియేటర్ పూర్వ ఇంత చిన్న వయసులోనే ఆర్థిక స్వేచ్ఛ గురించి నేరుకుంటుందా అని విస్తుపోతుందామె. ఇలాంటి తల్లిదండ్రేలే కదా సమాజానికి కావాలి అంటూ ఆ పేరెంట్స్‌ని చేసిన పనికి ప్రశంసిస్తుంది కంటెంట్ క్రియేటర్.
కలలు కనడం, నిర్మించడ, తనను తాను నమ్మడం వంటివి ఆచరణలో పెట్టినప్పుడే తెలుస్తుందని చేతల ద్వారా బహుచక్కగా వివరించారు ఆ చిన్నారి తల్లిదండ్రులు. గొప్ప తల్లిదండ్రులుగా ఉండటం అంటే ఇదే. కేవలం గ్రేడులు, మంచి మార్కులు కాదు..జీవిత పాఠాలు నేర్పించాలి, మనం లేకపోయినా..ఆ చిన్నారులు తమ జీవితాన్ని నిర్భయంగా లీడ్ చేయగల సామర్థ్యం పెంపొందించాలని అని నేర్పించే గొప్ప పేరెంటింగ్ పాఠం ఇది. ప్రతి తల్లిదండ్రలు తప్పక తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది కూడా కదూ..!.
(చదవండి: స్వచ్ఛ భారత్ కోసం విదేశీయుడి తపన..! నెటిజన్ల ప్రశంసల జల్లు)