
మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్ మిషన్‌ని చేపట్టి.. దశల వారీగా పలు కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరుగుదొడ్లు నుంచి పారిశుధ్య కార్యక్రమాలు, తాగునీరు, తదతరాలన్నింటిని స్వచ్ఛంగా పరిరక్షించుకునేలా సమర్థవంతమైన పథకాలు, కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఇంకా కొన్ని రాష్ట్రల్లో అక్కడక్కడ పరిశుభ్రత విషయంలో పరిస్థితి అత్యంత అధ్వాన్నంగానే ఉంది. అందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారే కరువు. అలాంటిది ఒక విదేశీయడు ఓ నియమాన్ని ఏర్పాటు చేసుకుని మరి వీధులను శుభ్రం చేస్తున్నాడు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఒక విదేశీయుడు వీధులను శుభ్రం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక సెర్బియన్ దేశస్తుడు మార్పుని ఆహ్వానించేలా ఆయనే స్వయంగా నడుంకట్టాడు. ఆయన్ ఏక్‌దిన్‌కే ఏక్ గల్లీ అనే చొరవతో ఈ కార్యక్రమాన్నిచేపట్టినట్లు వీడియోలో వివరించాడు.
దీన్ని నాలుగు రోజుల క్రితం ప్రారంభించినట్లు తెలిపాడు. ఇప్పటి వరకు ‘మిలీనియం సిటీ’లోని అనేక ప్రాంతాలను శుభ్రం చేస్తున్న వీడియోలను కూడా పంచుకున్నాడు. దీనికి స్థానికుల నుంచి కూడా మద్దతు లభించడం విశేషం. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు అతడు నిజంగా స్వచ్ఛమైన భారతీయుడిని అభివర్ణించడమే కాకుండా క్లీన్ ఇండియా కోసం భారతీయులను ప్రేరేపించేలా చేస్తున్న మహోన్నత వ్యక్తి అని మరి కొందరూ ఆ విదేశీయుడిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: అలాంటి ఇలాంటి అధిక బరువు కాదు..! ఏకంగా 325 కిలోలు..చివరికి..)