Shefali Jariwala: గ్లూటాతియోన్, విటమిన్‌ సీ ఇంజెక్షన్లు అంత ఖరీదా..? | Shefali Jariwala: Anti ageing treatments glutathione and Vitamin C Cost | Sakshi
Sakshi News home page

కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!

Jul 2 2025 1:09 PM | Updated on Jul 2 2025 3:54 PM

Shefali Jariwala: Anti ageing treatments glutathione and Vitamin C Cost

గత కొన్ని రోజులుగా, నటి-మోడల్ షెఫాలి జరివాలా అకాల మరణం రకరకాల ప్రశ్నలకు తెరలేపింది. ప్రాథమిక దర్యాప్తులో కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్‌లు తీసుకుందనే అనుమాతనం తోపాటు ఆమె గదిలోనే అవన్ని దొరకడం మరింత అనుమానాలకు ఊతమిచ్చింది. దీంతో అందం వ్యామోహం ఖరీదు ప్రాణామా..అని సర్వత్ర చర్చలు మొదలయ్యాయి. పైగా యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్లు గ్లూటాతియోన్, విటమిన్‌ సీల ఖరీదు ఎంతుంటుందనే ఆరాలు కూడా  మొదలయ్యాయి. ఇంతకీ ఆ కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సలకు ఎంత ఖర్చు అవుతుందంటే..? 

నటి మోడల్‌ షెఫాలి గత ఎనిమిదేళ్లుగా ఈ మందులు తీసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆమె ఇంటి నుంచి యాంటీ-ఏజింగ్ మాత్రలు, మల్టీవిటమిన్లు, గ్లూటాతియోన్ ఇంజెక్షన్ల నిల్వలు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

ప్రయోజనాలు..
భారత్‌లో గ్లూటాతియోన్, విటమిన్‌సీ ఇంజెక్షన్లకు భారీ డిమాండ్‌ ఉన్నట్లు నివేదికల్లో తేలింది. ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేయడం, పిగ్మెంటేషన్ నిరోధించడం, వృద్ధాప్యా సంకేతాలను దరిచేరనీయకుండా చేయడం వంటి ప్రయోజనాల రీత్యా టాబ్లెట్లు, ఇంజెక్షన్ల రూపంలో మార్కెట్లో అమ్ముడవుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. 

ప్రస్తుతం మార్కెట్లో దీని విలువ ఏడాదికి సుమారు రూ. 2 వేల కోట్లుగా ఉండగా, అది 2032 నాటికి రూ.5 వేల కోట్లుగా ఉంటుందని అంచనా. వెద్య నిపుణుల ప్రకారం..దీర్ఘకాలికంగా వినియోగించడం వల్ల పలు దుష్పరిణాముల తప్పవనేది సమాచారం. ఒక్కోసారిగా ప్రాణంతకంగా కావొచ్చని కూడా చెబుతున్నారు వైద్యులు.

ఈ చికిత్సల ఖరీదు..
ఈ కాస్మెటిక్‌ యాంటీ ఏజింగ్‌ చికిత్సలు వాళ్లు ఎంచుకున్న సెషన్‌లు ఆధారంగా ఉంటాయట. ఒక్కో సెషెన్‌ రూ. 5 వేల నుంచి 7 వేల వరకు చార్జ్‌ చేస్తారట. అంటే 5 సెషన్ల ప్యాకేజ్‌ దాదాపు రూ. 60 వేలు ఖర్చు అవుతుందట.  కొంతమంది వీటిని టాబ్లెట్‌ల రూపంలో తీసుకుంటారట. ఇలా అయితే గనుక ప్రామాణికంగా 30 ప్యాక్‌లు వినియోగిస్తారట. అంటే ప్యాక్‌కి 15 ఉంటాయట.  వాటి ధర రూ. 5,000. అంటే 30 ప్యాక్‌లకు రూ. 7,800 ఖర్చవుతుందని సమాచారం. అయితే మరికొందరూ ఎటువంటి వైద్య పర్యవేక్షణ లేకుండానే స్వీయంగా తీసుకుంటున్నారని చెబుతున్నారు నిపుణులు

నిపుణులు ఏమంటున్నారంటే..
చర్మ వ్యాధి నిపుణులు ఈ చికిత్సలు ప్రమాదకరం అని, ముఖ్యంగా వైద్య పర్యవేక్షణ లేకుండా తీసుకోవడం మరింత ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి నిపుణులు అందుబాటులోలేని బ్యూటీ సెలూన్‌లో అందిస్తుండటం బాధకరమని అన్నారు. 

ఇవి గనుక ప్రతిచర్యలకు దారితీస్తే చర్మ సమస్యల తోపాటు గుండె లేదా మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుందని చెబుతున్నారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, సెలబ్రిటీలు, యువత గ్లామర్‌ వెంటపడి ఈ ప్రమాదకరమైన ఫెయిర్‌నెస్‌ చికిత్సలు తీసుకునిప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు.

(చదవండి: అందం ముఖ్యమే.. కానీ, ఆ బలహీనతకు లొంగిపోకూడదు!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement