
కాంటా లగా గర్ల్ షెఫాలీ జరీవాలా (Shefali Jariwala) ఆకస్మిక మరణం రకరకాల చర్చలకు తెరలేపింది. యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్ల కారణంగా గుండెపోటు వచ్చి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో గ్లామర్ ప్రపంచంలో విపరీత పోకడలపై విమర్శలు వెల్లువెత్తాయి. సెలబ్రిటీలు, యువత అందం, నాజుకుతనంపై ఫోకస్ పెట్టి ప్రాణాలు పణంగా పెడుతున్నారనే వాదన తెరపైకి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం హాట్‌టాపిక్ మారిపోయింది. ప్రస్తుతం ఈ విషయంపై నటి ఖుష్బూ సుందర్ కూడా స్పందించారు.
యువత, యువ నటీనటులు ఎదుర్కొంటున్న ఆందోళనల గురించి నటి ఖష్బూ ప్రధానంగా ప్రస్తావించారు. ప్రస్తుతం అందరూ గ్లామర్‌కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది మంచి విషయమై అయినప్పటికీ కొన్ని విషయాలను గుర్తించుకోవాలంటూ అందానికి సంబంధించిన అమూల్యమైన సలహాలు సూచనలు అందించారామె. అవేంటంటే..
ఇది గ్లామర్ ఫీల్డ్‌కు పరిమితమైన సమస్య మాత్రమే కాదని.. సాధారణ యువతీయుకులు కూడా బాహ్య అందం అనే ఉచ్చులో పడిపోతున్నారని అన్నారామె. ‘‘ఏం చేస్తున్నారో..ఎలాంటి చికిత్సలు తీసుకుంటున్నాం అనే దానిపై పెద్దగా ఫోకస్ లేదు, ఆరోగ్యంపై జాగ్రత్త కూడా లేదని మండిపడ్డారు. ముఖ్యంగా తమ అందం తరిగిపోతే ఐడెంటిటీ ఎక్కడ కనుమరుగైపోతుందో అనే ఫోమో( FOMO) భయంతో చేసే తప్పులే ఇవి’’..
ముఖ్యంగా సోషల్ మీడియా కూడా మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలో డిసైడ్ చేసేస్తోందన్నారు. దాన్ని ఎప్పుడైతే వాటిని మనం సీరియస్ తీసుకుంటామో అప్పుడే సమస్యల వలయంలో చిక్కుకుంటామని అంటున్నారు ఖుష్బూ. ముందుగా బయటి ప్రపంచం నుంచి వచ్చే ఒత్తిళ్లను సమర్థవంతంగా నిర్వహించడం నేర్చుకోవాలి. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ముఖ్యమే..ఎంత వరకు తీసుకోవాలి అనేది మనపైనే ఆధారపడి ఉంది.
అంతేగాదు మనం ఎలా ఉండాలన్నది మనం నిర్ణయించుకోవలే గానీ ఎదుటి వారి మాటలకు, కామెంట్లకు తలొగ్గే బలహీనతకు లొంగిపోకూడదని చెబుతున్నారు. "ఇది మన జీవితం మనకు నచ్చినట్లుగా ఉండాలే గానీ..ఎవ్వరో నిర్ణయించినట్లు కాదనేది గుర్తరెగాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఏజ్‌తోపాటు వచ్చే వృద్ధాప్యాని ఆనందంగా ఆహ్వానించగలుగుతారు. దాన్ని కూడా అందంగా ఆరోగ్యవంతంగా నిర్వహించగలుగుతారు " అని చెబతున్నారామె.
బాలనటిగా సినీ ప్రపంచంలోకి వచ్చిన తకు ఇలాంటి ఒత్తిళ్లు లేవని, ఇండస్ట్రీలో సహృద్భావంతో కూడిన వాతావరణం ఉండేదని అన్నారు. తాము ఆరోజుల్లో బయటకు ఏ డ్రెస్స్‌లో అయినా ధైర్యంగా వెళ్లేవాళ్లం. ఎందుకంటే అప్పుడు ఇలాంటి ఇన్‌స్టా, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాల ట్రోలింగ్ భయం లేదు. సినిమాలో దర్శకుడి చెప్పినట్లుగా నడుచుకున్నా..బయట మాకు నచ్చిన శైలిలో బతకగలిగే స్వేచ్ఛ మాకుంది. నేటి యువ హీరో హీరోయిన్లకు, యుతకు ఆ అవకాశం లేకుండా పోవడం దురదృష్టకరం అన్నారు.
అంతెందుకు నా పిల్లలు ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో ఎలాంటి ట్రోలింగ్ బారినపడ్డారో తెలుసు. ఎందుకంటే వాళ్లు బాగా పొడుగ్గా ఉండటంతో.. ఖుష్బూ కూతుళ్లు ఇలా ఉండటం ఏంటని అనే మాటలు చాలా బాధించాయంటూ ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని కూడా షేర్ చేసుకున్నారు. తల్లిగా వాళ్ల బాగా పొడుగ్గా ఉండటం నన్ను ఇబ్బందిపెట్టలేదు కానీ, బయటి నుంచి వాళ్ల ఎదుర్కొన్న ఒత్తిడిని తాఉ చాలా దగ్గరగా చూశానన్నారు. అయితే తన పిల్లలకు దాన్ని ఎలా అధిగమించాలో కూడా నేర్పానని అన్నారు. ముందు మనం స్ట్రాంగ్ ఉంటే పిల్లలు కూడా అలాంటి వాటిని ధైర్యంగా ఫేస్ చేస్తాని అన్నారు. అలాగే తనకు ప్రత్యేక మేకప్ ఆర్టిస్ట్ గానీ, డిజైనర్ గానీ లేరని, అవన్నీ తానే స్వయంగా చేసుకుంటానని అన్నారామె.
యాంటీ-ఏజింగ్ చికిత్సలు మంచివేనా..
వృద్ధాప్య వ్యతిరేక చికిత్సలు మంచివనే అంటోంది ఖుష్బూ. ఎందుకంటే ఎప్పటికీ 20 ఏళ్లలా కనిపించేలా ఎలాంటి మ్యాజిక్ ఉండదని గుర్తించుకోండని అంటున్నారామె. మన శరీరంలో వయసు రీత్యా వచ్చే మార్పులను అంగీకరించండి, అందంగా ఉండేలా ప్రయత్నించండి అని పిలుపునిస్తున్నారు. అయితే అది ఎంత వరకు అనేదానిపై నియంత్రణ ఉండాలంటున్నారు. ఏదైనా ప్రారంభించండి..కానీ దాన్ని ఎక్కడ ఆపాలో కూడా కచ్చితంగా తెలియాలి అని చెబుతున్నారామె.
తాను కూడా వృద్ధాప్య వయసులోకి వచ్చానని, కానీ దాన్ని తాను అందంగా నిర్వహిస్తున్నా అని అన్నారు. "తన ముఖంపై ముడతలు ఉన్నాయి, కళ్లకు కళ్లజోడు పెట్టుకోవాల్సి వచ్చింది..అయితే వాటన్నింటిని స్టైలిష్‌గా నిర్వహిస్తున్నా. అందుకోసం రెగ్యులర్ షేషియల్స్ చేయించుకుంటా..స్కిన్ బాగుండేలా చూస్తా..అలా అని మితీమీరిన బ్యూటీ చికిత్సల జోలికి వెళ్లిపోను.
ఎందుకంటే ఎక్కడ ఆపాలి అన్నదానిపై క్లారిటీ ఉంది" అని నొక్కి చెబుతున్నారు ఖష్బూ. అలాగే బాహ్య అందం తోపాటు..లోపాల అంతర్గతంగా కూడా బాగుండాలని చెప్పారామె. బయటన ఎంత అందంగా ఉన్నా..లోపాల అంతర్గత శరీరం అనారోగ్యం పాలుకాకుండా రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని సూచించారామె. అమ్మాయిలంతా మిస్ అయ్యేది ఇక్కడేనని, బాహ్య రూపం కంటే.. అంతర్గత ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి అని పిలుపు ఇచ్చారామె.
(చదవండి: గుండె తరుక్కుపోయే ఘటన..! మూడేళ్లుగా అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా..)