
సంగీతానికి రోగ నిరోధక శక్తి ఉంది
రాయచూరు రూరల్: సంగీతానికి రోగ నిరోధక శక్తి ఉందని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో గాన సుధ సంస్ధ ఆధ్వర్యంలో జరిగిన సంగీతోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేటిి జీవిత విధానంలో మానసిక ఒత్తిడి అధికమైందని అన్నారు.
డివైడర్‌కు లారీ ఢీ..
డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
హొసపేటె: నగర బైపాస్ రోడ్డులో కరివేపాకు లోడ్‌తో వెళుతున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ పడిన ఘటన సోమవారం జరిగింది. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో లారీ డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి హొసపేటె నగరం మీదుగా ద్వారా ముంబైకి కరివేపాకు లోడ్‌తో వెళుతున్న లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని నగరంలోని ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో చేర్పించారు. హొసపేటె ట్రాఫిక్ స్టేషన్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి తనిఖీ చేశారు.
పీడీఓపై చర్యకు డిమాండ్
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా మలదకల్ గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి(పీడీఓ)పై చర్యలు చేపట్టాలని సమాజ సేవకుడు భీమరాయ డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024–25లో రూ.720 లక్షల మేర నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. స్వార్థం కోసం నిధులు వినియోగించుకున్నారని, రెండు రోజుల్లో చర్యలు చేపట్టకపోతే జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామన్నారు.

సంగీతానికి రోగ నిరోధక శక్తి ఉంది

సంగీతానికి రోగ నిరోధక శక్తి ఉంది