
నల్లబజారుకు తరలిస్తున్న బియ్యం పట్టివేత
రాయచూరు రూరల్: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దారి తప్పుతున్నాయి. పేదలకు అందిస్తున్న బియ్యం చౌక ధర దుకాణాల్లో ఉచితంగా బీపీఎల్ కార్డుదారులకు పంపిణీ చేస్తుండగా, వాటిని నల్ల బజారులో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అలాంటి వారి కార్డులను రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నా ఫలితం లేకుండా పోయింది. అంత్యోదయ కార్డులకు 14 కేజీలు జొన్నలు, 21 కేజీలు బియ్యం, బీపీఎల్ కార్డుదారులకు 2 కేజీలు జొన్నలు, 3 కేజీలు బియ్యం పంపిణీ చేయకుండా నల్ల బజార్‌కు తరలిస్తున్నారు. సిరుగుప్ప నుంచి రాయచూరుకు 550 ప్లాస్టిక్ బస్తాల్లో తరలిస్తున్న రూ.6.50 లక్షల విలువైన బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రిపోర్టర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా విజయ్
రాయచూరు రూరల్: రాయచూరు రిపోర్టర్ గిల్డ్ అధ్యక్షుడిగా విజయ్ జాగటగల్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 2025–27 సంవత్సర కాలానికి ఉపాధ్యక్షుడిగా జయరాం, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్, సభ్యులుగా ఈరణ్ణ, వెంకట సింగ్, శ్రీకాంత్, చంద్రకాంత్ ఎంపికయ్యారు.

నల్లబజారుకు తరలిస్తున్న బియ్యం పట్టివేత