
రైతుల ఆత్మహత్యలను నివారించాలి
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలోని జిల్లాల్లో రైతులు అధిక స్థాయిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వాటిని నివారించే దిశలో సర్కార్ కృషి చేయాలని దక్షిణ బీదర్ శాసన సభ్యుడు శ్రీశైలేంద్ర బిరాదార్ పేర్కొన్నారు. సోమవారం దక్షిణ బీదర్ శాసన సభ్యుడి కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులకు పరిహారం అందించి మాట్లాడారు. 9 మంది రైతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించారు. కపలాపుర, అష్టూరు, మీర్జాపూర్, జమీస్తాపూర్, ఘోడంపల్లి, సంగోడి తాండాలో పాము కరిచి మరణించిన కుటుంబాల ను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తమ సర్కార్ చర్యలు తీసుకోవాలని కోరారు.
జేసీబీ యజమానిపై
చర్యకు వినతి
రాయచూరు రూరల్: జేసీబీ దూసుకెళ్లి ముగ్గురి దుర్మరణానికి కారకుడైన యజమానిపై చర్యలు చేపట్టాలని కన్నడ రక్షణ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఇమ్రాన్ బడేసాబ్ మాట్లాడారు. మరణించిన చత్తీస్‌ఘడ్‌కు చెందిన విష్ణు, శివరాం, బలరాం కుటుంబాలకు పరిహారం అందించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం అందించారు.
విద్యుత్ చౌర్యం నేరం
రాయచూరు రూరల్: విద్యుత్ చౌర్యం నేరమని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, ఎంపీ కుమార నాయక్ పేర్కొన్నారు. తాలూకాలోని బిచ్చాలిలో పర్యటించిన సమయంలో గోదాములో అక్రమంగా విద్యుత్‌ను దొంగతనం చేసి రొట్టెల కేంద్రం నడుపుతుండటాన్ని గమనించి, దాడి చేసి పరిశీలించారు. ప్రభుత్వ నియమాలను ఉల్లఘించి విద్యుత్ వినియోగం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. మహిళలు స్వయం ఉపాధి, స్వయంకృషితో పైకి రావాలన్నారు. ఇలాంటి అన్య మార్గాలను విడనాడాలన్నారు.
సర్కారు అవినీతిపై
బీజేపీ ఆందోళన
హుబ్లీ: గృహ వసతి శాఖలో రాష్ట్ర ప్రభుత్వంఆధ్వర్యంలో జరుగుతున్న అవినీతి బండారం గురించి స్వపక్ష ఎమ్మెల్యేలే మంత్రుల అవినీతిపై బహిరంగంగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే.శివకుమార్, గృహ వసతి శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో మినీ విధానసౌధ ఆవరణలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు, కార్యకర్తలు సోమవారం ఆందోళన చేపట్టారు. సీఎం, డీసీఎం, మంత్రి జమీర్ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. పేదలకు పంచాల్సిన వివిధ పథకాల ఇళ్ల పంపిణీలో జరుగుతున్న అవినీతిపై ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపణలు చేయడం కీలకం అన్నారు. సంబంధిత మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్‌తో పాటు సీఎం, డీసీఎంలు కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తూ రాష్ట్ర గవర్నర్‌కు వారు విజ్ఞప్తి చేశారు. సంబంధిత వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు మంజునాథ, ప్రభు, నారాయణ, జగదీశ్, సరోజ, వినాయక్ తదితరులు పాల్గొన్నారు.
చిన్న వర్షానికే చిత్తడి
హొసపేటె: నగరంలో సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షం కారణంగా జాతీయ రహదారి వెంట సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న దళితుల ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. కానాహొసహళ్లి హైవే పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న దళితుల కాలనీ ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. ప్రజలు, వాహనదారులకు కష్టకరంగా మారింది. వర్షాకాలంలో వాహనదారులు కిందపడి ఆస్పత్రి పాలైన సందర్భాలు చాలా ఉన్నాయి. గ్రామస్తులు ఈ విషయం గురించి జాతీయ రహదారుల శాఖ అధికారులకు అనేక సార్లు సమాచారం అందించినా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే ఈ పని భద్రత లేకుండా, అశాసీ్త్రయమైన పనిగా జరిగింది, దీని వలన ప్రజలకు, వాహన రాకపోకలకు, హైవే పక్కన నివసించే దళిత కుటుంబాలకు చాలా ఇబ్బంది కలిగింది. ఇది ప్రతి సంవత్సరం వర్షాకాలంలో సమస్యగా మారుతోంది. ఇక్కడ నివసించే ప్రజలు ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు.

రైతుల ఆత్మహత్యలను నివారించాలి

రైతుల ఆత్మహత్యలను నివారించాలి