
పేదల ఇళ్లు ఫలహారం
మైసూరు: రాష్ట్రంలో ఇళ్ల చుట్టూ రాజకీయం దుమారం రేగుతోంది. రోజూ దీనిపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పేదలకు ఇళ్ల మంజూరు ఎమ్మెల్యే స్థాయిలోనే అమ్ముడుపోతోందని సీనియర్ ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ ఆరోపించారు. మంగళవారం మైసూరులో జలదర్శినిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇళ్ల కేటాయింపుల్లో ఆశ్రయ సమితే సుప్రీం. లబ్ధిదారులు గ్రామ సభల ద్వారా ఎంపిక కావాలి. కానీ ఆశ్రయ సమితి, ఎమ్మెల్యే స్థాయిలోనే ఇళ్లను లంచాలకు అమ్మేస్తున్నారు. పనుల్లో మంత్రికి 10 శాతం కమీషన్ పోతుంది. కాంట్రాక్టర్లకు 25 శాతం పోతుందన్నారు.
సీఎంపై మండిపాటు
సీఎం నియోజకవర్గంలో ముడా కూడా పాడైందని, మైసూరు ప్యాలెస్ దివాళా తీస్తోందని విశ్వనాథ్ ఆరోపించారు. సీఎం సిద్దరామయ్య రాష్ట్రాన్ని వేలం వేశారు అని మండిపడ్డారు. మైసూరు ప్యాలెస్‌కు ప్రపంచ ఖ్యాతి ఉంది, అయితే ముగ్గురు ముఠాగా ఏర్పడి దసరా చేసుకొంటున్నారు. అన్ని చోట్లా ఆయన శిష్యులే కూర్చొని పాడు చేస్తున్నారన్నారు. సిద్దరామయ్య ఇంక ఏం ఉద్ధరిస్తారని హేళన చేశారు. అన్ని గ్యారంటీ భాగ్యాలను మహిళలకు ఇచ్చారన్నారు. మీరు పిచ్చోడు అయితే ప్రజలు పిచ్చోళ్లా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాల వాడకం అన్ని చోట్లా ఎక్కువైందని ఆరోపించారు.
ఎమ్మెల్యే, మంత్రులకు కమీషన్‌లు
ఎమ్మెల్సీ విశ్వనాథ్ ఆరోపణ