
ఆ రోడ్డులో ప్రయాణం.. నరకప్రాయం
హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు పట్టణంలోని తుంగభద్ర విద్యా సంస్థ సమీపంలోని ఉజ్జయిని– జోలా రోడ్డు గుంతలు పడి వాహన సంచారం నరకప్రాయంగా మారింది. ఈ రోడ్డులో సంచరించే వాహనదారులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సంచరిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటు వహించినా వారు ఆస్పత్రి పాలయ్యే అవకాశం ఉంది. రోడ్డుపై గుంతలు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంది. వర్షాలతో అధికంగా నీరు చేరడం వల్ల గుంతల్లో నీరు నిలిచి రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడిన ఉదంతాలు ఉన్నాయి. గుంతలు పడిన రోడ్డును చూసి పట్టణ గ్రీన్ టీం, రైడర్లు సజావుగా ప్రయాణించడానికి వీలుగా గుంతలను మట్టితో నింపింది. అయితే వర్షం కారణంగా రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. ఏదైనా ప్రమాదం జరగక ముందే అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డుకు సత్వరం మరమ్మతులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.