
టీబీ డ్యాం... 45 టీఎంసీలు
ప్రభుత్వ ఆస్పత్రిలో
ఎమ్మెల్యే తనిఖీ
కోలారు: నగరంలోని ఎస్‌ఎన్‌ఆర్ జిల్లా ఆస్పత్రికి ఆదివారం ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ వెళ్లారు. ఆస్పత్రిలో సౌలభ్యాలు, సమస్యల గురించి రోగుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది హాజరు పుస్తకం, రికార్డులను పరిశీలించారు. మలేరియా , డెంగ్యూ, లాంటి రోగాలు పెరుగుతున్నాయి. స్వఛ్చత కాపాడడానికి నగరసభ తగిన చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. ఆస్పత్రిలో ఎట్టి పరిస్థితిలోను రోగులకు మందుల చీటీలను బయటకు రాసివ్వకూడదని, ఆస్పత్రిలోనే ఇవ్వాలని సూచించామన్నారు. లేని పక్షంలో అలాంటి వైద్యులపై చర్యలు తప్పవన్నారు. ఆస్పత్రిలో స్వచ్ఛతను పాటించాలన్నారు. నిత్యం ఆస్పత్రికి 120 మందికి పైగా రోగులు వస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుంగా అన్ని సౌలభ్యాలు కల్పించాలని సూచించామన్నారు. పిల్లల వార్డులో శిశువులకు ట్యాగ్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించామని తెలిపారు.
ఆటో బోల్తా.. యువతి మృతి
ఉరవకొండ రూరల్:
ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందిన ఘటన ఉరవకొండ మండల పరిధిలోని పెన్నహోబిళం సమీపంలో ఆదివారం జరిగింది. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన భక్తులు శనివారం పెన్నహోబిళం క్షేత్ర దర్శనానికి వచ్చారు. ఆదివారం స్వగ్రామానికి ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. ఆలయ సమీపంలో మలుపు వద్ద ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న లావణ్య (18) అనే బాలిక గాయపడగా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఘటనలో మరో ముగ్గురు గాయపడగా వారికి చికిత్సలు అందించినటు ఎస్‌ఐ తెలిపారు.

టీబీ డ్యాం... 45 టీఎంసీలు