
జాతీయ పార్టీలను తిరస్కరించాలి
● సీపీఎం నాయకుడు కరుణానిధి పిలుపు
హొసపేటె: కాంగ్రెస్, బీజేపీలను తిరస్కరించాలని ఈనెల 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని సీపీఎం తాలూకా కమిటీ నాయకుడు ఏ.కరుణానిధి పిలుపునిచ్చారు. బుధవారం చిత్తవాడిగిలో పార్టీ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. పహల్గాం దాడి తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య శత్రుత్వాన్ని నాటుతోందని, మత సహనాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అంతర్గత కలహాల్లో కూరుకుపోయిందన్నారు. ప్రజల బాధలను వినడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. అటువంటి పరిస్థితిలో ప్రజలు కాంగ్రెస్, బీజేపీలను తిరస్కరించి, నిరంతర పోరాటం ద్వారా ముందుకు నడిచే సీపీఎం పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు. పార్టీ నాయకుడు హెచ్‌ఎం.జంబునాథ్ మాట్లాడుతూ హొసపేటెలోనే చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజలకు జీవనాధారమైన చక్కెర కర్మాగారం, డిస్టిలరీ మూతపడటానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలే ప్రత్యక్ష బాధ్యత వహించాలన్నారు. ప్రజలకు నివసించడానికి సొంత ఇల్లు లేదు, చేయడానికి పని లేదు, మతతత్వ శక్తులు ఈ పరిస్థితులన్నింటినీ దోపిడీ చేస్తున్నాయి. కనుక ప్రజలు ఎలాంటి విధి లేకుండా పోరాటానికి ముందుకు రావాలన్నారు.