
వీధుల్లో మురుగు పరుగు
రాయచూరు రూరల్: పట్టణంలోని పలు వీధుల్లో మరుగుదొడ్లకు చెందిన డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ నిండిపోవడంతో పారిశుధ్య పరిస్థితి గంభీరంగా మారింది. నిండిన మ్యాన్‌హోల్స్ నుంచి మురుగునీరు రహదారిపైకి ప్రవహిస్తుండంటంతో దుర్వాసన వెదజల్లుతోంది. బందే నవాజ్ కాలనీ రహదారిపై ప్రజలు నడవాలంటే జంకే పరిస్థితి చోటు చేసుకుంది. 1976లో ఈ చాంబర్ పద్ధతిని ప్రవేశ పెట్టారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏ మాత్రం ట్యాంకులు సరిపోవడం లేదు. నాటి నుంచి పైసా ఆదాయం లేని వీటి నిర్వహణ నగరసభకు తలనొప్పిగా మారింది. కొత్తగా మ్యాన్‌హోల్స్ చేసిన సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కర్ణాటక భూగర్భ జల మండలి అధికారులు నిర్వహణ నగరసభ అధికారులదే అంటూ చేతులు దులుపుకున్నారు. 1976లో రూ.కోటి నిధుల మంజూరుతో వీటిని నిర్మించారు. అప్పట్లో నగరసభ, కాంట్రాక్టర్లు ఏకమై పనులను నాసిరకంగా చేపట్టారు. రెండేళ్లు కూడా కాక ముందే మ్యాన్‌హోల్స్ నుంచి మురుగు నీరు బజారులోకి వస్తున్నాయి. వీటి శుభ్రతకు సఫాయి కర్మచారులు ఎవరూ అంతగా ముందుకు రావడం లేదు. గతంలో వేసిన పైపుల లీకేజీతో మురుగు నీరు రహదారిలోకి వస్తున్నాయి.