
యూరియా కోసం రైతన్న పాట్లు
హొసపేటె: తాలూకాలో యూరియా ఎరువు కొరత కారణంగా నగరంలోని ఐఎస్‌ఆర్ రోడ్డులోని తాలూకా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల సహకార సంఘం ముందు యూరియా ఎరువుల కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ ప్రకటించినా జిల్లా కేంద్రంలోనే యూరియా ఎరువు కొరత ఏర్పడింది. రైతుల డిమాండ్ ప్రకారం 9 వేల బస్తాల ఎరువులు అవసరం. అయితే సొసైటీ వద్ద 450 బస్తాలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఈ బస్తాలను పొందడానికి రైతులు క్యూలో నిలబడాల్సి వచ్చింది. ప్రతి రైతుకు కేవలం మూడు బస్తాల ఎరువులను పంపిణీ చేశారు. 150 మందికి ఒక్కొక్కరికి రూ.280 ధర ప్రకారం ప్రస్తుతం సొసైటీ రైతులకు పంపిణీ చేసిన 450 బస్తాలను అందించారు.