
డిమాండ్లు తీర్చాలని రైతుల నిరసన
హొసపేటె: తాలూకాలో చక్కెర కర్మాగారాన్ని నిర్మించాలి, చెరుకు సాగు చేసే రైతులకు పట్టాలు, పహణీలు ఇవ్వాలని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం, గ్రీన్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు సీఏ గాళెప్ప డిమాండ్ చేశారు. విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి పట్టణ ఆలయం నుంచి బయలుదేరి గాళెమ్మ ప్రధాన రహదారి గుండా బసవేశ్వర సర్కిల్ వరకు పాదయాత్రగా వెళ్లిన రైతులు వివిధ డిమాండ్లను నెరవేర్చాలని డిప్యూటీ తహసీల్దార్ జి.శివకుమార్ గౌడకు వినతిపత్రం సమర్పించారు. రైతు సంఘం, గ్రీన్ ఆర్మీ తాలూకా అధ్యక్షుడు జి.రమేష్, హెచ్.ఎస్.మల్లికార్జున గౌడ, కే.దురుగప్ప, పరశురామ హేమన్న, మైలారప్ప, కే.ఆనంద్, దొడ్డబసప్ప, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.