రూ.26.28 లక్షల విలువైన సొత్తు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రూ.26.28 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

Jun 23 2025 5:54 AM | Updated on Jun 23 2025 5:54 AM

రూ.26

రూ.26.28 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

హుబ్లీ: జిల్లాలోని నవళగుందలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు దొంగలను పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. నిందితులనుంచి రూ. 26.28 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. ధార్వాడ జిల్లా ఎస్పీ డాక్టర్‌.గోపాల బ్యాకోడ ఆదివారం వివరాలు వెల్లిడించారు. నగరంలోని సల్మా అన్వర, హుస్సేన్‌ కేరూర ఇళ్లలో జరిగిన చోరీలకు సంబంధించి గాలింపు చేపట్టి ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నవళగుందలోని జోషిప్యాటి గుడ్డదకేరి, గొల్లర వీధి, దాసనాళ గ్రామాల్లో జరిగిన చోరి కేసులకు సంబంధించి 30 గ్రాముల బంగారు, 200 గ్రాముల వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సౌదత్తి తాలూకా హిరేకుంబి గ్రామంలో జరిగిన చోరీకి సంబంధించి 25 గ్రాముల బంగారు, 70 గ్రాముల వెండి స్వాధీనం చేసుకుననట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేయడంలో చొరవ చూపిన నవళగుంద సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ జనార్ధన్‌, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు బహుమానంతో పాటు ప్రసంశపత్రాలు ప్రదానం చేశారు.

సీనియర్‌ పాస్టర్‌ కన్నుమూత

సాక్షి,బళ్లారి: బళ్లారి నగరంలోని హవంబావి ప్రాంతంలో ఉన్న ఏజీ చర్చి సీనియర్‌ పాస్టర్‌ రెవరండ్‌ ఎన్‌.సంపత్‌కుమార్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో కొంత కాలంగా బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందారు. వారం రోజుల క్రితం బళ్లారిలోని బళ్లారి హెల్త్‌ సీటి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. సంపత్‌ కుమార్‌ మరణ వార్త వినగానే చర్చి పాస్టర్లు, చర్చి సభ్యులు ఆస్పత్రికి చేరుకొని నివాళులర్పించారు. అనంతరం భౌతికకాయాన్ని స్వగృహానికి చేర్చి ప్రజల సందర్శన కోసం ఉంచారు. సోమవారం అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సంపత్‌కుమార్‌ అల్లుడు రెవరండ్‌ రాజరత్నం వెల్లడించారు. అంత్యక్రియలకు ఆల్‌ ఇండియా ఏజె చర్చిల సూపరిండెంట్‌ పౌల్‌ తంగయ్య, వివిధ చర్చల పాస్టర్లు పాల్గొంటారు. వేరే ప్రాంతాల్లో ఉంటున్న సంపత్‌కుమార్‌ ఇద్దరు కుమార్తెలు, అల్లుడు బళ్లారికి పయనమయ్యారు. సంపత్‌కుమార్‌ భౌతికకాయం వద్ద చర్చి మహిళలు కన్నీరు మున్నీరుగా విలపించారు. సంపత్‌కుమార్‌ సేవలను పలు చర్చిల పాస్టర్లు కొనియాడారు. సంపత్‌కుమార్‌ మృతి క్రైస్తవ సమాజానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు.

ఒపెక్‌ అస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు

రాయచూరురూరల్‌ : నగరంలోని రాజీవ్‌గాంధీ సూపర్‌ స్పేషాలిటీ–ఒపెక్‌–ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలను రోగులకు అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్‌ నీతిస్‌ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన ఒపెక్‌ ఆస్పత్రిని సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. కల్యాణ కర్ణాటకతోపాటు ఏపీ, తెలంగాణ నుంచి కూడా రోగులు ఇక్కడ వైద్యం కోసం వస్తారన్నారు. క్యాన్సర్‌, కార్డియాలజీ, యూరాలజీ ప్లాస్టిక్‌ సర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో సర్జికల్‌ తదితర వైద్యం అందుబాటులో ఉందన్నారు. ఆస్పత్రి ప్రత్యేక అధికారి డాక్టర్‌ రమేష్‌ సాగర్‌ పాల్గొన్నారు.

27న దేవదుర్గకు దేవెగౌడ రాక

రాయచూరురూరల్‌: దేవదుర్గలో ఈనెల 27న నిర్వహించే జనతాదళ దర్శన్‌ కార్యక్రమానికి మాజీ ప్రధాని దేవెగౌడ హాజరవుతారని ఆ పార్టీ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి తెలిపారు.అదివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. 26 న సింధనూరు, మాన్విలో కార్యకర్తల సమావేశం ముగించుకోని రాయచూరులో రాత్రి బస చేస్తారన్నారు. 27న దేవదుర్గ తాలూకా చిక్క హోన్నకుణి వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన దేవెగౌడ విగ్రహాన్ని మనవడు నిఖిల్‌కుమారస్వామి ఆవిష్కరిస్తారన్నారు. శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్‌ మాట్లాడుతూ 2028 ఎన్నికల్లో జేడీఎస్‌ విజయం సాధిస్తుందన్నారు. శివ శంకర్‌, మహంతేస్‌ పాటిల్‌, సిద్దన తాతా, మ్లలప్ప సాహుకార్‌, లక్ష్మిపతి, తిమ్మా రెడ్డి, నరసింహనాయక్‌ పాల్గొన్నారు.

ఆ గనులను ప్రైవేటుకు అప్పగిస్తారా?

రాయచూరు రూరల్‌: దేశానికి బంగారాన్ని అందించే రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకాలోని హట్టి బంగారు గనులను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ప్రజల్లో ప్రచారం జరుగుతోంది. డెక్క్‌న్‌, ఎక్స్‌పో రేషన్‌, జియో మైసూరు, అర్‌ఏంఏపీఎంపీఎల్‌, ఎంఎస్‌పీఏల్‌ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్లు చెబుతున్నారు.

రూ.26.28 లక్షల విలువైన సొత్తు స్వాధీనం 1
1/2

రూ.26.28 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

రూ.26.28 లక్షల విలువైన సొత్తు స్వాధీనం 2
2/2

రూ.26.28 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement