
ఎల్లో లైన్‌లో మెట్రో రైళ్లను నడపాలి
యశవంతపుర: బెంగళూరు నమ్మ మెట్రో ఎల్లో లైన్‌లో రైలు మార్గం నిర్మాణాలను సత్వరమే పూర్తి చేసి ఆర్‌వీ రోడ్డు– బొమ్మసంద్ర రూట్‌లో సర్వీసులను ప్రారంభించాలని నగర బీజేపీ నాయకులు శనివారం లాల్‌బాగ్ పార్కు ముందు ఆందోళన చేశారు. ఎంపీలు తేజస్వీ సూర్య, పీసీ మోహన్, ఎమ్మెల్యే రామమూర్తి, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఎంఆర్‌సీఎల్ సంస్థ బెంగళూరు ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఈ మార్గంలో మెట్రో రైలును ప్రారంభిస్తే 10 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. సిల్క్ బోర్డ్ వద్ద ప్రజలు బస్సుల కోసం గంటల కొద్దీ నిలబడాల్సి వస్తోందని చెప్పారు.
నెల రోజుల్లో పూర్తి చేస్తాం
ఆగస్ట్ 15లోపు బెంగళూరు సొరంగ మార్గంలో రైలు సంచారాన్ని ప్రారంభించనున్నట్లు బీఎంఆర్‌సీఎల్ ఎండి మహశ్వర్‌రావ్ తెలిపారు. బీజేపీ నిరసనపై ఆయన స్పందిస్తూ ఎల్లో మార్గంలో మెట్రో సంచారానికి మూడు కోచ్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. భద్రతా తనిఖీలు, మిగిలిన పనులను నెల రోజులలో పూర్తి చేసి త్వరలోనే మెట్రో సర్వీసులను ప్రారంభిస్తామన్నారు. జయనగరలో వంతెనను నిర్మించాలని డిమాండ్లు వచ్చాయన్నారు.
బీజేపీ ఎంపీల ధర్నా