
ఇప్పుడు సాకారమైంది
పలువురు స్థానిక గ్రామస్తులు మాట్లాడుతూ 1960 ల నుంచి వంతెన నిర్మాణం కోసం కోరుతున్నామని, ఇప్పుడు సాకారమైందని సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి సిగందూరులోని చౌడేశ్వరి దేవస్థానానికి భక్తులు వస్తుంటారు. ఇక్కడ నది వల్ల చుట్టూ తిరిగి వస్తున్నారు. ఇప్పుడు వంతెన నిర్మాణం వల్ల దూరం గణనీయంగా తగ్గిపోతుందని తెలిపారు. అలాగే చుట్టుపక్కల శరావతి నది బ్యాక్‌వాటర్‌లో ఉండే దీవుల గ్రామాల ప్రజలకు కూడా సాగర్ పట్టణానికి వెళ్లడానికి రవాణా సౌకర్యం మెరుగవుతుంది. ప్రస్తుతం నదిలోని తీర గ్రామాలు, ద్వీప గ్రామాలకు వెళ్లడానికి పెద్ద పెద్ద ఫెర్రీలను వాడుతున్నారు. కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలను కూడా అందులోనే తరలిస్తుంటారు. ఫెర్రీ ప్రయాణం ఎంతో వ్యయ ప్రయాసలతో పాటు ప్రమాదాలతో కూడుకున్నది కావడం గమనార్హం.

ఇప్పుడు సాకారమైంది

ఇప్పుడు సాకారమైంది