
పల్లెల్లో నీటి సరఫరాకు డిమాండ్
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సక్రమంగా నీటి సరఫరా చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు. బుధవారం రాయచూరు తాలూకా పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు ముజాహిద్ మాట్లాడారు. మన్సలాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని మర్చేడ్, ఇతర ప్రాంతాలలో కూడా తాగునీరు లబించక పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తాగు నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని పీడీఓ, అధ్యక్షులు, అధికారుల దృష్టికి తెచ్చినా నీటి ఎద్దడి నివారణలో అధికారులు విఫలమయ్యారన్నారు. వారం రోజుల్లో నీటిని సరఫరా చేయకపోతే పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి తాళం వేయడం జరుగుతుందంటూ తాలూకా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు.